యష్ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యశ్ పాల్
Prof. Yash Pal at the inauguration of the IUCAA Girawali Observatory in 2006
జననంయష్ పాల్
(1926-11-26)1926 నవంబరు 26
జాంగ్, బ్రిటిష్ ఇండియా
( ప్రస్తుతం పాకిస్తాన్ )
మరణం2017 జూలై 24(2017-07-24) (వయసు 90)
నోయిడా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
పౌరసత్వంభారతీయుడు
రంగములుఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్
వృత్తిసంస్థలుటి.ఐ. ఎఫ్. ఆర్, ముంబై, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, అహ్మదాబాద్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం)
చదువుకున్న సంస్థలు
  • పంజాబ్ విశ్వవిద్యాలయం * పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్
    ఎమ్.ఐ.టి
పరిశోధనా సలహాదారుడు(లు)బ్రూనో రోసీ
ముఖ్యమైన విద్యార్థులుశ్యామ్ టాండన్
ప్రసిద్ధిస్పేస్ సైన్స్, ఎడ్యుకేషన్, టెలివిజన్ యాంకర్, పబ్లిక్ ఔట్ ట్రీచ్
ముఖ్యమైన పురస్కారాలుపద్మ విభూషణ్ (2013)
పద్మ భూషణ్ (1976)
మార్కోని బహుమతి (1980)
లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు
కళింగ అవార్డు (2009) </ small>

యష్ పాల్ ( నవంబర్ 26, 1926 - జూలై 24, 2017 ) ఒక భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. ఈయనకు 2013 లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1926, నవంబర్ 26 న లో బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ లోని ఝాన్గ్ లో (ప్రస్తుతం పాకిస్తాన్) లో జన్మించాడు.[1] ఈ జాంగ్ ప్రాంతంలో భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అబ్దుస్ సలాం జన్మించిన ప్రదేశం కూడా. ఈయన 1945-1947 మధ్య లాహోర్ క్యాంపస్‌లో భౌతికశాస్త్రం విభాగంలో బిఎస్సి ఆనర్స్ పూర్తిచేసాడు.  ఇందులో ఈయన లాహోర్‌లోని స్టూడెంట్స్ యూనియన్‌లో విద్యార్థి కార్యకర్తగా ఉన్నాడు. 1947-1949 పంజాబ్ విశ్వవిద్యాలయం యొక్క ఢిల్లీ క్యాంపస్‌లో తన ఎమ్. ఎస్సీ ని పూర్తిచేసాడు. ఈయన యునైటెడ్ స్టేట్స్ లోని బోస్టన్ లో తన పిహెచ్.డి విద్యను పూర్తిచేసాడు.[2]

కెరీర్[మార్చు]

ఈయన ముంబై లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఎఫ్ఆర్) లో కాశ్మిక్ కిరణాల సమూహంలో సభ్యుడిగా తన ఉద్యోగ వృత్తిని ప్రారంభించాడు. ఈయన తన పిహెచ్‌డి కోసం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్లి టిఎఫ్‌ఆర్‌కు తిరిగి వచ్చాడు. 1972 లో భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖను ఏర్పాటు చేసింది. 1973 లో అహ్మదాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అంతరిక్ష అనువర్తనాల కేంద్రానికి ఈయనను మొదటి డైరెక్టర్‌గా నియమించారు. ఈయన 1981–82 లో రెండవ ఐక్యరాజ్యసమితి సదస్సు శాంతియుత ఉపయోగాలపై నిర్వహించిన సదస్సులో సెక్రటరీ జనరల్‌గా పనిచేశాడు. ఈయన 1983-84 లో చీఫ్ కన్సల్టెంట్, ప్లానింగ్ కమిషన్ గా పనిచేశాడు.[3] 1984-1986 లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి పదవులను నిర్వహించాడు. 1986-91 లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) గా చైర్మన్‌గా నియమితులయ్యాడు. ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్, సైంటిఫిక్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరెటికల్ ఫిజిక్స్, ట్రీస్టే అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం యొక్క యుఎన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించాడు. ఈయన 2007-2012 మధ్యకాలంలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కులపతి గా పనిచేశాడు.[4]

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

1976 లో భారత ప్రభుత్వం సైన్స్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి చేసిన కృషికి ఈయనకు పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2009 లో యునెస్కో వారి కళింగ బహుమతిని అందుకున్నాడు. 2011 అక్టోబర్ లో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారాన్ని పొందారు. మార్చి 2007 నుండి మార్చి 2012 వరకు న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా పనిచేశాడు. 2013 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2000లో సైన్స్ విభాగంలో విశేష కృషి చేసినందుకు ఈయనకు ఇందిరా గాంధీ బహుమతిని అందుకున్నాడు. 2006 లో మేఘనాడ్ సాహా మెడల్ ని అందుకున్నాడు.

మరణం[మార్చు]

ఈయన వయస్సు నిమిత్త సమస్యల వల్ల జూలై 24, 2017 న ఉత్తరప్రదేశ్‌ లోని నోయిడా లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Prof. Yash Pal" (PDF). Retrieved 20 November 2019.[permanent dead link]
  2. "Distinguished Alumni". Panjab University Chandigarh. Archived from the original on 2011-10-04. Retrieved 2019-11-20.
  3. "Distinguished Alumni". Panjab University Chandigarh. Archived from the original on 2011-10-04. Retrieved 2019-11-21.
  4. iiasa.ac.at, "Yash Pal, CV" Archived 2011-05-31 at the Wayback Machine, 18 November 2005, retrieved 21 November 2019
"https://te.wikipedia.org/w/index.php?title=యష్_పాల్&oldid=3462694" నుండి వెలికితీశారు