యార్లగడ్డ రామనాధ బాబు
యార్లగడ్డ రామనాధ బాబు (1911 - 1961) విద్యాదాత, వితరణశీలి, కవి పండిత పోషకులు
జీవిత విశేషాలు
[మార్చు]రామనాధ బాబు గారు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో సంపన్న రైతు కుటంబంలో యార్లగడ్డ రంగనాయకులు దంపతులకు 1911 లో జన్మించారు[1]. వీరు తమ తాత గారి పేరుతో పర్చూరు లో యార్లగడ్డ రామన్నోన్నత పాఠశాల ను నిర్మించారు. చీరాల లో తన తండ్రి పేరుతో ఊటుకూరి రామయ్య శ్రేష్టి, యార్లగడ్డ రంగనాయకులు నాయుడు కాళాశాల [2] కు భూరి విరాళాం ఇచ్చారు. వీరి ధర్మపత్ని పేరిట యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళా కళాశాలను వీరి భూరి విరాళాం తో నిర్మించారు.[1]
తాళ్ళరేవు హైస్కూలు, బాపట్ల వ్యవసాయ కళాశాల, బాలికల హైస్కూలుకు విరివిగా దానం ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం, ఋషికేశ్ లలో సత్రాలకు విరాళాలు ఇచ్చారు. భద్రాచల రామాలయ నిర్మాణం కొరకు కల్లూరి చంద్రమౌళి గారికి 50 వేలు విరాళం ఇచ్చారు. విజయవాడ లయోలా కళాశాలకు , తెనాలి వి.యస్.ఆర్ కాలేజీ, నిడిబ్రోలు కాలేజీ లకు కూడా విరాళాలు ఇచ్చారు[1].
బాపట్ల సాల్వేషన్ ఆర్మీ వైద్యశాల నిర్మాణంకు సహాయం చేసారు.
రామనాధ బాబు గారు గుండె పోటుతో 1961 లో ఆకశ్మికంగా మరణించారు. వీరికి సంతానం లేదు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి వెంకట నారాయణ. p. 227.
- ↑ "VRS & YRN College". Archived from the original on 2021-08-01. Retrieved 2021-08-01.