Jump to content

యుక్తి కపూర్

వికీపీడియా నుండి
యుక్తి కపూర్
2023లో యుక్తి కపూర్
వృత్తిActress
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • సియా కే రామ్
  • అగ్నిఫెరా
  • మేడమ్ సర్

యుక్తి కపూర్ ప్రధానంగా హిందీ టెలివిజన్‌ రంగంలో కనిపించే భారతీయ నటి. స్టార్ ప్లస్ పౌరాణిక ధారావాహిక సియా కే రామ్లో ఊర్మిళ, &టీవి డ్రామా సిరీస్ అగ్నిఫెరాలో రాగిణి సింగ్, సోనీ సబ్ హాస్య ధారావాహిక మద్దం సర్‌లో ఎస్.ఐ. కరిష్మా సింగ్ పాత్రలను పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.

కెరీర్

[మార్చు]

ఆమె 2010లో నన్హి సి కలి మేరీ లాడ్లీతో తన కెరీర్ ప్రారంభించింది. ఇందులో గుడ్డి పాత్రతో ఆమె టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2013లో, ఆమె ఝిల్మిల్ సితారోన్ కా అంగన్ హోగాలో తనూ చౌహాన్‌గా, ప్యార్ కా దర్ద్ హై మీఠా ప్యారా ప్యారాలో బిట్టూగా, యే హై మొహబ్బతేన్‌లో మయూర దునావతిగా నటించింది. అదే సంవత్సరం, ఆమె కా ఉఖాద్‌పురి చిత్రంతో భోజ్‌పురి సినిమాలోనూ అడుగుపెట్టింది.

2015లో, ఉవా సినిమాతో హిందీలోనూ ఆమె అరంగేట్రం చేసింది. ఆ తరువాత, ఆమె స్టార్ ప్లస్ సియా కే రామ్‌లో ప్రధాన పాత్రను పోషించింది, అక్కడ ఆమె కరణ్ సుచక్ సరసన ఊర్మిళ పాత్రను చేసింది.

2016లో, ఆమె బాలికా వధు టీవి ధారావాహిక సుధా షెఖ్వత్ పాత్రను పోషించింది.

2017లో, ఆమె అంకిత్ గేరా, సిమ్రాన్ కౌర్‌లతో కలిసి అగ్నిఫెరాలో కథానాయిక రాగిణి సింగ్‌గా నటించింది.[1]

2020లో, ఆమె తన మొదటి మ్యూజిక్ వీడియో ఫకీరిలో కనిపించింది. అప్పటి నుండి, కపూర్ గుల్కీ జోషితో కలిసి సోనీ సబ్ మేడం సర్‌లో లక్నోకు చెందిన మహిళా పోలీసు ఎస్.ఐ. కరిష్మా సింగ్ పాత్రను పోషిస్తోంది. 2022లో, ఆమె తన ద్విపాత్రాభినయంతో మేడం సర్‌లో కరిష్మా సింగ్ పాత్రకు కవల సోదరి అయిన కౌసల్య సింగ్‌ను కూడా పోషించింది.

సెప్టెంబరు 2023 నుండి, ఆమె స్టార్ ప్లస్ కెహ్ దూన్ తుమ్‌హీన్‌లో ముదిత్ నాయర్‌తో కలిసి ఒంటరి తల్లి కీర్తి శుక్లా పాత్రను పోషిస్తోంది.[2]

గుర్తింపు

[మార్చు]
సంవత్సరం పురస్కారం విభాగం సినిమా పలితం మూలాలు
2022 21వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి - కామెడీ మేడం సార్ నామినేట్ చేయబడింది [3]
2౨వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ప్రముఖ నటి (నాటకం) నామినేట్ చేయబడింది [4]

మూలాలు

[మార్చు]
  1. "Yukti Kapoor goes bold for 'Agnifera' - Times of India". The Times of India.
  2. "Star Plus launches a never-seen-before murder mystery show Keh Doon Tumhein starring Mudit Nayar and Yukti Kapoor". Bollywood Hungama. Retrieved 22 August 2023.
  3. "Check Out The 21st Indian Television Academy Awards Winners List". TheITA2021 (in ఇంగ్లీష్). Retrieved 7 March 2022.
  4. "22nd Indian Television Academy Awards Nominations - Vote Now". Indian Television Academy Awards. Retrieved 9 September 2022.