Jump to content

యూ ఎస్ ఓపెన్ - 2023

వికీపీడియా నుండి

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంటు 2023 సంవత్సరపు పోటీల్లో మహిళల సింగిల్స్ టైటిల్ ను కోకో గాఫ్ (అమెరికా), పురుషుల సింగిల్స్ టైటిల్ ను నోవాక్ జకోవిచ్ (సెర్బియా) కైవసం చేసుకున్నారు.[1]

మహిళల సింగిల్స్

[మార్చు]

2023 సెప్టెంబర్ 10వ తేదీన అమెరికా లోని న్యూయార్క్ ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ బెలారస్ క్రీడాకారిణి సబలెంక పై విజయం సాధించింది. కోకో గాఫ్ కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. సెరేనా విలియమ్స్ (1999) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను నెగ్గిన టీనేజర్ గా కోకో గాఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.[2]

పురుషుల సింగిల్స్

[మార్చు]

2023 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో జకోవిచ్ రష్యా ఆటగాడు డానియల్ మెద్వదెవ్ పై విజయం సాధించారు. యూ ఎస్ ఓపెన్ - 2023 పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్ ... కెరీర్ లో 24వ గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్రకి ఎక్కాడు.

మూలాలు

[మార్చు]
  1. "US Open Men's Singles 2023: యూఎస్‌ ఓపెన్ విజేత‌గా జొకోవిచ్‌". Sakshi Education. Retrieved 2023-11-02.
  2. "US OPEN 2023: యూఎస్ ఓపెన్ విజేతగా అమెరికన్‌ టీనేజర్‌ కోకో గాఫ్". EENADU. Retrieved 2023-11-02.