యెరెవాన్ ఒపేరా థియేటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరెవాన్ ఒపేరా థియేటరు
యెరెవాన్ ఒపేరా థియేటరు
పటం
Addressయెరెవాన్
ఆర్మేనియా
Construction
Opened20 జనవరి 1933 (1933-01-20)
Reopened1939
Rebuilt1953, 2002
Architectఅలెగ్జాండర్ తమానియన్

ఆర్మేనియన్ జాతీయ విద్యా ఒపేరా, బలెట్ థియేటరు ను (అర్మేనియన్:Ալեքսանդր Սպենդիարյանի անվան օպերայի և բալետի ազգային ակադեմիական թատրոն (అలెగ్జాండర్ స్పెండియార్యని అంవన్ ఒపెరాయి యేవ్ బలేటి అజ్గాయిన్ అకడేమియాకన్ టాట్రన్) ),  అలెగ్జాండర్ స్పెండియార్యన్ పేరిట నామకరించారు. దీనిని యెరెవాన్లో అధికారికంగా 1993 జనవరి 20న అలెగ్జాండర్ స్పెండియార్యన్ ఆల్మాష్ట్ ఒపేరా ప్రదర్శనతో ప్రారంభించారు. ఈ ఒపేరా భవనాన్ని ఆర్మేనియన్ ఆర్కిటెక్ట్ అలెగ్జాండర్ తమానియన్ డిజైన్ చేశారు. దీనిలో రెండు కాన్సర్ట్ హాళ్లు ఉన్నవి: 1,400 సీట్లతో అరాం ఖచాతూరియన్ కచేరీ హాల్   , 1,200 సీట్లతో అలెగ్జాండర్ స్పెండియార్యన్ ఒపేరా, బాలెట్ నేషనల్ థియేటర్ ఉన్నవి.

చరిత్ర

[మార్చు]

ఒపేరా థియేటరుకు పునాధులు 1930 నవంబరు 28న సోవియట్ ఆర్మేనియా యొక్క 10 వ వార్షికోత్సవ వేడుకల సమయంలో వేశారు. 1933 జనవరి 20న, భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. థియేటర్ ఏర్పడిన వెంటనే ఒక బ్యాలెట్ బృందం స్థాపించబడింది. ప్యోటర్ ఇలిచ్ చైకోవ్స్కి కు చెందిన స్వాన్ లేక్ 1935లో ఇక్కడ మొదటి బ్యాలెట్ డాన్సును  ప్రదర్శించారు.

తమానియన్ డిజైన్ ఆధారంగా తన కుమారుని యొక్క పర్యవేక్షణలో థియేటర్ హాల్ 1939 లో పూర్తయింది, తరువాత ఒపేరా భవనాన్ని అలెగ్జాండర్ స్పెండియార్యన్ పేరిట నామకరణం చేశారు. పెద్ద ఎత్తునున్న నిర్మాణపనులు 1953 వరకు పూర్తి కాలేదు, తరువాత భవనానికి ప్రస్తుతం ఉన్న ఆకారం వచ్చింది.

ఈ థియేటరు ప్రారంభంతో కొత్త నేషనల్ ఒపేరా, నాటకాలకు సృష్టి జరిగింది. మొదటి ఆర్మేనియన్ బ్యాలెట్ అరాం ఖచాతూరియన్ వేసిన హ్యాపీనెస్  ఉంది. బ్యాలెట్ ఆధారంగా ఈ కంపోజర్ వెంటనే గయానె ను రూపొందించారు, దానిని ప్రపంచమంతటా ప్రదర్శించారు. తరువాత అనేక ఇతర ఆర్మేనియన్ స్వరకర్తలు ఒపేరాలు, నాటకాలను రచించారు. కొన్ని సంవత్సరాలుగా, ఈ థియేటరు వద్ద ఎంతో మంది కళాకారులు పనిచేశారు, వారు: గాయకులు గొహార్ గస్పర్యాన్, తాతెవిక్ సజందార్యన్, మిహ్రాన్ యెర్కాట్, పావెల్ లిసిత్సియాన్, హయ్కనుష్ దనియల్యాన్, నార్ హోవ్హాన్నిస్యాన్, గెగామ్ గ్రిగొర్యాన్, అనహిట్ మెకితరియన్; కండక్టర్ల కాన్స్టాంటిన్ సరజీవ్, మైఖేల్ తవ్రిజ్యాన్, అరామ్ కతన్యాన్, యూరి దవ్త్యాన్; బ్యాలెట్ మాస్టర్స్ ఎ. పెట్రోస్యాన్, ఎమ్. చెంష్క్యాన్, వనుష్ ఖనమిర్యాన్, వైలెన్ గలస్త్యాన్; చిత్రకారులు మార్టిరూస్ సర్యాన్, మినాస్ అవెతిస్యాన్.

1935 నుండి ఆర్మెన్ టిగ్రాన్యన్ చే అనౌష్ అనే ఒక వినూత్నమైన ఆర్మేనియా ఒపేరా ప్రదర్శన యెరెవాన్ ఒపేరా ధియేటరులో జరిగింది. ఆర్మేనియా యొక్క ఒపేరా చరిత్రకు ఇది మొదటి అడుగు. ఇప్పటికి కూడా అనౌష్ ఈ ధియేటరుకు రిపర్టోరీగా పనిచేస్తున్నారు.

ప్రారంభించినప్పటి నుండి, ఆర్మేనియన్ జాతీయ ఒపేరా, బాలెట్ థియేటరులో అర్మేనియన్, రష్యన్, పశ్చిమ ఐరోపా స్వరకర్తలకు చెందిన రెండు వందలకంటే ఎక్కువ వేర్వేరు ఒపేరాలు, నాటకాల ప్రదర్శించారు. ఇక్కడ 20 దేశాల కంటే ఎక్కువ, ఉదాహరణకు రష్యా, స్పెయిన్, లెబనాన్, యునైటెడ్ స్టేట్స్, గ్రీస్, జర్మనీ ప్రదర్శనలు జరిగాయి. 1956 లో, ఈ థియేటరుకు  ఆర్మేనియన్ జాతీయ ఒపేరా, బాలెట్ థియేటరు బిరుదు వచ్చింద.

థియేటరులో చార్లెస్ అజ్నవోర్, ఐయాన్ ఆండర్సన్, జాన్ మెక్లాఫ్లిన్, అక్వారియం వటి ఎందరో ప్రదర్శనలు చేశారు.

కళాత్మక దర్శకులు

[మార్చు]
  • రోమనోస్ మెలికియాన్
  • టిగ్రాన్ లెవోన్యాన్
  • ఒహాన్ దురియాన్
  • గెగామ్ గ్రిగోర్యాన్
  • కాన్స్టాంటైన్ ఒర్బెలియన్ (2016 నుండి)

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]