యెరెవాన్ నీటి ప్రపంచం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరెవాన్ నీటి ప్రపంచం
WaterWorld Yerevan.jpg
యెరెవాన్ నీటి ప్రపంచం
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
యజమానిఎక్స్ గ్రూప్
ప్రారంభం2001
ఆపరేటింగ్ సీజన్వేసవిలో (ఓపెన్-ఎయిర్ పార్కు)
సంవత్సర్ం పొడవునా (ఇండోర్ పార్కు)
విస్తీర్ణం3 hectares (7.4 acres)
కొలనులు7 అవుట్ డోర్ and
3 ఇండోర్ pools
నీటి జారుడు బల్లలు12 water slides
పిల్లల ప్రదేశాలు2 children's areas

యెరెవాన్ నీటి ప్రపంచం (అర్మేనియన్:Ջրաշխարհ (జ్రష్కర్) ) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఉన్న ఒక నీటి పార్కు. ఇది నార్ నార్క్ జిల్లా  లోని  మ్యస్నిక్యాన్  అవెన్యూ పైన  ఉంది.[1]  ఈ నీటి ప్రపంచంలో 2.5 హెక్టార్ల విస్తీర్ణంలో బహిరంగ వాటర్ పార్కు, 0.5 హెక్టార్లలో ఇండోర్ వాటర్ పార్కు  ఉన్నాయి.

వేసవి నీటి పార్కు[మార్చు]

యెరెవాన్ నీటి ప్రపంచాన్ని 2001లో ప్రారంభించారు. ఇది యెరెవాన్ జూ, బొటానికల్ గార్డెన్ మధ్య 2.5 మైళ్ళ హెక్టార్ల వైశాల్యంలో మైస్నిక్యన్ ఎవెన్యూలో ఉంది. యెరెవాన్ లోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో యెరెవాన్ నీటి ప్రపంచం ఒకటి.

బహిరంగ పార్కులో 2 పెద్ద కొలనులు, 1 పిల్లల పూల్, 1 వి.ఐ.పి పూల్, వాటర్ స్లైడ్ ఆకర్షణలను కలిగిన 3 కొలనులను ఉన్నాయి. ఆహారపదార్ధాల, పానీయాల దుకాణాలు, 120 సామర్ధ్యం కలిగిన ఒక రెస్టారెంటు ఇక్కడ ఉన్నవి.

శీతాకాలంలో సమయంలో, పార్కులోని అతిపెద్ద పూల్ ఒక మంచు స్కేటింగ్ రింకుగా మారుతుంది, ఇది 500 చ.కి.మీ, ఉపరితలాన్ని కలిగి ఉంటుంది.[2]

ఇండోర్ నీటి పార్కు[మార్చు]

అక్వేటేక్ అని పిలవబడే ఇండోర్ నీటి పార్కును 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది 0.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.[3] . దీనిలో రెండు పెద్ద పూల్స్, ఒక పిల్లల పూల్ ఉన్నవి, వీటిలో అనేక జలపాతాలు, గీజర్స్, జెట్ లు ఉన్నాయి. ఇండోర్ ఉద్యానవనంలో 29 గదులున్న ఆక్వేటెక్ స్పా హోటల్ ఉన్నది, దానిలో ఒక పెద్ద ఫిట్నెస్ క్లబ్, వైద్య పునరావాస కేంద్రం, వాల్-క్లైంబింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఆక్వేటెక్ సంవత్సర పొడవునా ఎటువంటి సెలవులూ లేకుండా తెరిచి ఉంటుంది.

సూచనలు[మార్చు]

  1. "Yerevan Water World". Archived from the original on 2013-12-02. Retrieved 2018-07-04.
  2. "Ice skating at Water World Yerevan". Archived from the original on 2018-10-08. Retrieved 2018-07-04.
  3. Aquatek Yerevan

బాహ్య లింకులు[మార్చు]