Coordinates: 40°09′20″N 44°29′58″E / 40.15556°N 44.49944°E / 40.15556; 44.49944

యెరెవాన్ మాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెరెవాన్ మాల్
ప్రదేశంషెంగావిత్ జిల్లా,
యెరెవాన్, ఆర్మేనియా
అక్షాంశ రేఖాంశాలు40°09′20″N 44°29′58″E / 40.15556°N 44.49944°E / 40.15556; 44.49944
ప్రారంభ తేదీఫిబ్రవరీ 14, 2014
నిర్మాణ శిల్పిఅర్చాంగెల్ ఆర్కిటెక్టురల్ స్టూడియో
స్టోర్‌ల సంఖ్య, సేవలు125
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం59,000 square metres (640,000 sq ft)
ఫ్లోర్ల సంఖ్య3
వెబ్‌సైటుyerevanmall.am

యెరెవాన్ మాల్ (అర్మేనియన్:Երևան Մոլ) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోని అర్షకున్యత్స్ అవెన్యూ పైన ఉన్న ఒక షాపింగ్ మాల్. ఇది 2014 వ సంవత్సరంలో ప్రారంభమైంది, విస్తీర్ణ స్థలం, దుకాణాల సంఖ్య ప్రకారం చూసుకుంటే ఇది ఆర్మేనియా లోని అతిపెద్ద మాల్..

విచర్రెఫోర్  హైపర్ మార్కేట్ ను 2015 మార్చి 11 వ తేదీన ప్రారంభించారు.

కినోపార్కు, ఆర్మేనియా ఉన్న అత్యంత ఆధునిక, వినూత్న సినిమా థియేటరు. కెప్టెన్ కిడ్స్ ట్రెజర్ ఐలాండ్, ఆర్మేనియా లోని అతిపెద్ద ఇండోర్ ఎంటర్టైన్మెంట్ సెంటరులు యెరెవాన్ లో ఉన్నవి.

చరిత్ర

[మార్చు]

యెరెవాన్ మాల్ షాపింగ్ సెంటరు ఫెబ్రవరీ 20, 2014 వ తేదీన ప్రెసిడెంటు సెర్ఝ్ సర్గస్యాన్ సమక్షంలో ప్రారంభించబడింది.[1] ఈ ప్రాజెక్టును 2010వ సంవత్సరం చివరిలో ప్రారంభించారు. ఈ సెంటర్ 59,00 చదరపు మీటర్లలో విస్తరించి, 125 దుకాణాలను కలిగి ఉంటుంది.

ప్రారంభ వేడుకల సమయంలో యెరెవాన్ మాల్

2014 లో కెప్టెన్ కిడ్స్ ట్రెజర్ ఐలాండ్, ఆర్మేనియాలోని అతిపెద్ద ఇండోర్ ఎంటర్టైన్మెంట్ సెంటరును యెరెవాన్ మాల్ లో ప్రారంభించారు.

యెరెవాన్ మాల్ భవనము

2015 వ సంవత్సరంలో, మొట్టమొదటి, ఏకైక కర్రెఫోర్ హైపర్మార్కెట్టును యెరెవాన్ మాల్ లో ప్రారంభించారు. కర్రెఫోర్ ఆర్మేనియాలో " ప్రతి రోజూ తక్కువ ధరలు" అనే నినాదంతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. కర్రెఫోర్ ఒక కొత్త సంస్కృతిని రిటైల్ వ్యాపార రంగానికి పరిచయం చేసింది. ఇది ఆర్మేనియాకు చౌకథర, నాణ్యత గల వస్తువులను పరిచయం చేసింది.

2015 లో, కినోపార్క్ మల్టీప్లెక్స్ సినిమా థియేటరును యెరెవాన్ మాల్ లో ప్రారంభించారు.

డిసంబరు 2015 ముగింపు నాటికి, యెరెవాన్ మాల్ తన యాప్ ను ఐ.ఓ.ఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్-ఫోన్లలో విడుదలచేశారు. ఇలాంటి అపికేషను ఆర్మేనియాలోనే మొట్టమొదటిది, ఇది జరుగుతున్న దుకాణ లావాదేవీల గురించి ప్రజలకు తెలియజేసింది. ఎన్నో ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ యాప్ నుండి కినోపార్కు థియేటరులో సినిమా టికెట్టులు కొనుక్కోవచ్చు.[2]

2016 వ సంవత్సరంలో యెరెవాన్ మాల్ క్లబ్ కార్డ్ ప్రాజెక్ట్ అనే కస్టమర్ రాయల్టీ ప్రోగ్రామును మొదలుపెట్టారు. ఇది ఆర్మేనియాలో అతిపెద్ద ప్రాజెక్టు అవడమే కాక రిటైల్ రంగంలో ఒక కొత్త విధానాన్ని తయారుచేసింది. మొదటి క్లబ్ కార్డ్ లాట్టరీను జనవరి 27 న ఏర్పరిచారు, అందులో వందల యాక్టివ్ కార్డ్ యూసర్స్ కు బహుమతులు వచ్చాయి. వాటిలో మిని కూపర్ లక్సరీ కారు కూడా ఉన్నది.[3]

2016 వ సంవత్సారంలో యెరెవాన్ మాల్ లో ఆర్మేనియాలోని ఏకైక మాంగో మాన్ ను ప్రారంభించారు.

వినోదం

[మార్చు]
బహిరంగ పార్కింగు లాట్
2015 డిసెంబరు 2 న ఈ మాల్ లో కినోపార్కు థియేటరు ను ప్రారంభించారు. కినోపార్కు 4కె అల్ట్రా హెచ్.డి. క్వాలిటీ ప్రొజెక్టరును, డాల్బి ఆట్మోస్ సౌండు ఉన్న ఆరు అత్యుత్తమ నాణ్యత ఉన్న హాళ్ళను తీసుకున్నారు. వీటిలో ఒక హాల్ ప్రీమియం, దానిలో 30 సెల్ఫ్-కంట్రోల్డ్ సీట్లు ఉన్నవి..[4]

ఈ మాల్ లో అనేక కెఫేలు, 20 ఆపరేటర్లను కలిగిన ఒక పెద్ద ఫుడ్-కోర్టు ఉన్నవి. అక్కడ ప్రపంచంలోని 12 రకాల వంటకాలు ఉన్నవి.

దుకాణాలు

[మార్చు]
మాల్ లోని స్ట్రడివారియుస్ దుకాణం

యెరెవాన్ మాల్ లో అనేక దుకాణాలు ఉన్నవి, అవి:

 • జరా
 • స్ట్రడివారియుస్
 • మాంగో
 • పుల్ & బేర్
 • నెవార్కర్
 • బెర్ష్కా
 • కిరా ప్లాస్తినినా
 • కర్పిసా
 • గియొర్డనో
 • మాంసూన్
 • ఆక్సెసరీజ్
 • టెస్కో
 • ఒకైది
 • లెవిస్ స్ట్రస్ & కో
 • సెలియో
 • ఆల్డో గ్రూప్
 • క్రాక్స్
 • టేప్ అ ఎల్ ఓయిల్
 • జెన్నీఫర్
 • జూలియా & మోర్
 • బల్ది
 • కె.ఎఫ్.సి
 • కర్రెఫోర్

సూచనలు

[మార్చు]
 1. "Opening ceremony of Yerevan Mall shopping center". Archived from the original on 2018-10-08. Retrieved 2018-07-03.
 2. "Yerevan Mall Mobile Application website". Archived from the original on 2017-09-25. Retrieved 2018-07-03.
 3. "Yerevan Mall Club Card Lottery". Archived from the original on 2017-04-27. Retrieved 2018-07-03.
 4. "KinoPark is open at the Yerevan Mall". Archived from the original on 2018-10-08. Retrieved 2018-07-03.