యేజెళ్ళ శ్రీరాములు చౌదరి
యేజెళ్ళ శ్రీరాములు చౌదరి ఆయుర్వేద పశువైద్యాచార్యులు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన గుంటూరు జిల్లా తెనాలి లో స్థిరపడ్డారు.అంగలూరు గ్రామంలో 1897 లో జన్మించారు. కాలేజీ చదువులతో నిమిత్తం లేకుండానే పశు వైద్య శాస్త్ర రంగంలో ప్రవేశించి అనితర సాధ్యమైన కృషి చేసి "అభినవ సహదేవ" గా దేశ స్థాయి ఖ్యాతిని అందుకున్నారు. పశువైద్య రంగంలో వివిధ వైద్య గ్రంథాలను రాసారు. పశువుల వ్యాధుల నివారణకు నూతన ఔషథాలను రూపకల్పన చేసారు.
1926 తెనాలిలో పశువైద్య కళాశాలను నెలకొల్పడమే కాక, పశువుల వ్యాథుల పరిశోధనకు, అవసరమైన మందుల తయారీకి ప్రత్యేకంగా మరో సంస్థను స్థాపించారు. మందుల తయారీ నిమిత్తం అవసరమైన మూలికా మొక్కలను పెంచడానికి ప్రత్యేక అటవీ క్షేత్రానికి రూపకల్పన చేసారు. పశువైద్యంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన తరువాత రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాయి.[1]
ఆయన వైద్యకళా విభూషణ బిరుదాంకితులు. శ్రీరాములు పశువైద్య గ్రంథమాల, ఆయుర్వేద పశుచికిత్సాలయాల వ్యవస్థాపకులు. ఆంధ్ర జాతీయ పశువైద్య విద్యాపీఠానికి అధ్యక్షునిగా, ఆంధ్ర జాతీయ పశువైద్య కళాశాలకు ఆయన ప్రాచార్యుని(ప్రిన్సిపల్)గా వ్యవహరించారు.[2] ఇతనికి అభినవ సహదేవ అనే బిరుదు ఉంది. గోసేవ పత్రికకు సంపాదకత్వం వహించి నడిపినారు.
ఈయన 1960 లో మరంచినారు. తెనాలి పట్టణంలో ఈయన స్థాపించిన సంస్థలు ఈనాటికీ సేవలందిస్తున్నాయి.
రచనలు[మార్చు]
- అనుభవ పశువైద్య చింతామణి
- ఆంగ్లేయ పశువైద్య వస్తుగుణదీపిక
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 52.
- ↑ యేజెళ్ళ, శ్రీరాములు చౌదరి (1937). ఆంగ్లేయ పశువైద్యవస్తుగుణదీపిక. విజయవాడ. Retrieved 13 March 2015.