యోగులు (పురాణం)
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
యోగులు మరొక వర్గీకరణ ప్రకారం నాలుగు విధాల వారు ఉంటారు. 1. ప్రాథమిక కల్పకులు. ఆత్మవిచారణ సాధనాలైన ఉపనిషత్తులు మొదలైన వేదవిద్యా గ్రంథాల జ్ఞానం కొంత సంపాదించిన వారు. 2. మరు భూమికులు. ఇంద్రియాలను అదుపుచేసే ప్రయత్నంలో ఉన్న ఋతంభరా ప్రజ్ఞావంతులు. వీరు రెండవ వర్గానికి చెందిన వారు. 3. పంచేంద్రియాలను అదుపుచేసి, పంచభూతాల అవగాహన కలిగించుకున్న వారు ప్రజ్ఞాజ్యోతులు. 4. జీవించి ఉన్నప్పుడే ముక్తిని సాధించ గలిగిన ‘అతిక్రాంత భావనీయులు’ నాలుగవ వర్గం యోగులు. పతంజలి యోగదర్శనం సమాధిపాదంలో 21వ సూత్రమైన ‘తీవ్ర సంవేగా మాసన్నః’లో సంవేగ అనే పదానికి ‘కేవలం వైరాగ్యం అని కాకుండా వైరాగ్యంతో కూడిన సాధన కార్యంలో ముందుకు సాగటంలో ఉండే నేర్పు అని చెప్పుకోవచ్చు’ అని శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు తమ ‘యోగదర్శనమ్’ గ్రంథంలో వివరించారు. 22వ సూత్రమైన మృదు మధ్యాధి మాత్రత్వాత్తతో-పి విశేషః’ ప్రకారం సాధన తీవ్రత అనేది మృదు, మధ్యమ, అధిమాత్ర స్థాయిలలో ఉంటుందనీ, యోగసిద్ధి కలిగే కాలం శీఘ్రత్వం ఈ మూడిరటిలోని స్థాయిని బట్టి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. యోగ సాధకులలో ఏ వర్గం వారికైనా ఈ మూడు స్థాయిలు వర్తించవచ్చు.