రంగనాయకి జయరామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగనాయకి జయరామన్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్య కళాకారిణి,
భరతనాట్యం గురువు,
నృత్యదర్శకురాలు

రంగనాయకి జయరామన్ భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు, నృత్యదర్శకురాలు.

విశేషాలు

[మార్చు]

ఈమె భరతనాట్యాన్ని తన అత్త కె.లలిత వద్ద 5వ యేటి నుండి నేర్చుకుంది. 1939లో చెన్నైలో కె.లలిత స్థాపించిన "శ్రీ సరస్వతి గాన నిలయం"లో మొట్టమొదటి విద్యార్థిని ఈమె. ఈమె భరతనాట్యంతో పాటుగా గాత్ర సంగీతం, వయోలిన్, వీణ, నట్టువాంగం, హరికథ మొదలైన వాటిలో ప్రావీణ్యం సంపాదించింది. ఈమె తన మొట్టమొదటి నాట్యప్రదర్శనను తన 11వయేట రుక్మిణీదేవి అరండేల్ సమక్షంలో ఇచ్చింది.

తరువాత ఈమె ఈ శిక్షణ సంస్థను కొనసాగిస్తూ అనేక మంది కళాకారులను తయారు చేసింది.

ఈమె వద్ద భరతనాట్య శిక్షణను పొందినవారిలో కొందరు:

 • సుభాషిణీ వెంకటేష్
 • దివ్య
 • బినేష్ మహదేవన్
 • పద్మినీ కృష్ణమూర్తి
 • పద్మాలక్ష్మి సురేష్
 • రేవతి
 • చిత్ర మురళీధరన్
 • పద్మప్రియ ప్రకాష్
 • హర్షిత
 • సంజన
 • దివ్యమీనాక్షి
 • కె.హెచ్.జాహ్నవి
 • ఎన్.లలిత
 • ఆర్.శివప్రియ
 • ఎస్.నర్మద
 • కె.పద్మశ్రీ
 • ఎం.ప్రీతి
 • శాంతిని అరుణగిరి
 • టి.ఎ.విరజ & టి.ఎ.వసుధ

ఈమె సింగపూర్, అమెరికా దేశాలలో భరతనాట్యానికి సంబంధించి వర్క్‌షాపులను నిర్వహించింది. అనేక కేసెట్లను, సి.డి.లను విడుదలచేసింది. శక్తి ప్రభావం, శివప్రభావం, కృష్ణాంజలి, షణ్ముగ ప్రభావం, భావయామి రఘురామం, గురునామ స్మరణం, లలితా ప్రభావం, నవరస నాయకి, మారుతి మహిమై, దైవిగ వాహనగల్, ఖందపురాణం, భక్తియిన్ శక్తి వంటి నృత్యనాటికలను రూపొందించింది.[1] ఈమె ఆకాశవాణిలో ఏ గ్రేడు వీణా కళాకారిణి. దూరదర్శన్ కొరకు పంచ తాళ ప్రియ మాలిక, పంచ రాగ ఔదవ మాలిక వంటి వీణాగోష్టి కార్యక్రమాలను రూపొందించింది.

బిరుదులు, పురస్కారాలు

[మార్చు]
 • 1992లో శంకరాభరణం ట్రస్ట్ వారిచే "నాట్యకళా భూషణి"
 • 1994లో పొలాచి సభ, చెన్నై వారిచే"నాట్యకళావిదగి"
 • 1995లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ వారిచేకళైమామణి
 • 2001లో కపాలి ఫైన్ ఆర్ట్స్ వారిచే "నాట్యాచార్య"
 • 2004లో పార్థసారథి స్వామి సభ, చెన్నై వారిచే "నాట్యకళాసారథి"
 • 2011లో భారతీయ విద్యాభవన్ వారిచే "నృత్యరత్న" పురస్కారం.[2]
 • 2015లో సంగీత నాటక అకాడమీ అవార్డు -2015[3]
 • 2015లో తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్‌ ఆర్ట్స్ యూనివర్సిటీ వారిచే జయం అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ[4]
 • 2020లో శ్రీకృష్ణగానసభ, చెన్నై వారిచే నాట్యకళావిశారద[5]

మూలాలు

[మార్చు]
 1. L.S. (24 August 2007). "Diligent and committed". The Hindu. Retrieved 12 May 2021.
 2. Staff Reporter (19 October 2011). "Recognition". The Hindu. Retrieved 12 May 2021.
 3. Staff Reporter (7 October 2016). "Honour for stalwarts". The Hindu. Retrieved 12 May 2021.
 4. Staff Reporter (25 February 2015). "Three-day fine arts festival". The Hindu. Retrieved 12 May 2021.
 5. Staff Reporter (3 January 2020). "Title for dance guru". The Hindu. Retrieved 12 May 2021.