రంగపురవిహార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగపురవిహార అనునది శ్రీముత్తుస్వామి దీక్షితారు గారు రచించిన కృతులలో ఒక్కటి. శ్రీరంగములోని రంగనాథస్వామివారి మీద రాసిన ఈ కృతిని ఎం. ఎస్. సుబ్బులక్ష్మిగారు ఐక్యరాజ్యసమితిలో గానం చేసినారు.

కీర్తన[మార్చు]

పల్లవి:

రంగాపురవిహారా జయ కోదండరామావతార రఘువీర శ్రీరంగపురవిహారా |

అనుపల్లవి:

అంగజజనకదేవ బృందావనసారంగేంద్ర వరద రామాంతరంగ శ్యామళాంగ విహంగ తురంగ సదయాపాంగా సత్సంగ |

చరణం:

పంకజాప్తకులజలనిధిసోమ వర పంకజముఖ పట్టాభిరామా

పదపంకజజితకామా రఘురామా

వామాంకగతసీతావర శేషాంకశయనా భక్తసంతోష

ఏణాంక రవినయనా మృదుతరభాష ఆకళంకదర్పణకపోలవిశేష

మునిసంకటహరణ గోవింద వేంకటరమణ ముకుంద

సంకర్షణమూలకంద శంకరగురుగుహానంద

లక్షణము[మార్చు]

రాగం: బృందావనసారంగ

తాళం: రూపకం

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]