హీమోగ్లోబిన్

వికీపీడియా నుండి
(రక్తచందురం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హీమోగ్లోబిన్
(హెటెరోటెట్రామెర్, (αβ)2)
మానవ హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణం.

ఈ ప్రోటీన్లు α, β ఉపభాగాలు ఎరుపు, నీలం లోను, ఇనుము కలిగిన హీమ్ సమూహాలు ఆకుపచ్చలోను ఉంటాయి. PDB 1GZX Proteopedia Hemoglobin నుండి

-
Protein type మెటల్లొప్రోటీన్, గ్లోబులిన్
Function ఆక్సిజన్-రవాణా
Cofactor(s) హీమ్ (4)
-
Subunit
name
Gene Chromosomal
locus
Hb-α1 HBA1 Chr. 16 p13.3
Hb-α2 HBA2 Chr. 16 p13.3
Hb-β HBB Chr. 11 p15.5

హీమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ లేదా రక్తచందురం అనేది అన్ని సకశేరుకాల (చేప కుటుంబం చన్నిచ్త్యిడే మినహా) యొక్క ఎర్ర రక్త కణాలలో ఇనుమును కలిగి ఆక్సిజన్ రవాణా చేసే మెటల్లొప్రోటీన్ (లోహ ప్రోటీన్), అలాగే కొన్ని అకశేరుకాల యొక్క కణజాలం. రక్తంలో హీమోగ్లోబిన్ శ్వాసకోశ అవయవాల (ఊపిరితిత్తులు లేదా మొప్పలు) నుండి మిగిలిన శరీరానికి (ఉదా: కణజాలం) ఆక్సిజన్‌ చేరవేస్తుంది. అక్కడ ఇది ఆక్సిజన్‌ను జీవక్రియ అనే ప్రక్రియలో జీవి యొక్క విధులకవసరమైన శక్తి కొరకు శక్తిని అందించడానికి వాయుసహిత శ్వాసక్రియను అనుమతించడానికి విడుదల చేస్తుంది. హీమోగ్లోబిన్ అనే ఈ పదార్థము కారణంగానే మానవ శరీరంలోని రక్తం ఎర్రగా ఉంటుంది. శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఊపిరితిత్తులవద్ద హీమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకొని శరీరం మొత్తానికి ప్రాణవాయువును సరఫరా చేస్తూ ఉంటుంది. అలా హీమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాలలోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. అందువలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకొనుటకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాంసం, చేపలు, గ్రుడ్లు వంటి జంతు సంబంధమైన ఆహారపదార్థాలను శరీరం త్వరగా జీర్ణించుకొని ఐరన్ ను స్వీకరించగలుగుతుంది. శాకాహార సంబంధమైన ఆకుకూరలు, ఎండుఫలాలు, పండ్లు, కాయగూరలలో ఐరన్ (ఇనుము) తగినంత ఉన్నప్పటికి శరీరం వాటిని పూర్తిగా జీర్ణించుకోలేకపోవటంతో వాటి నుండి శరీరం తగినంత ఐరన్ ను స్వీకరించలేకపోతుంది. అయితే శాఖాహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా శరీరానికి కావలసినంత ఐరన్ పొందవచ్చు, తద్వారా రక్తంలో తగినంత హీమోగ్లోబిన్ శాతం ఏర్పడి రక్తహీనత బారి నుండి తప్పించుకోవచ్చు. ఒక వ్యక్తి తన సాధారణ ఆరోగ్య పరిస్థితికి భిన్నంగా మార్పు సంభవించిందని భావించినప్పుడు, ముఖ్యంగా రక్తహీనతకు గురవుతున్నానని భావించినప్పుడు ఎర్రరక్తకణాలు తగినన్ని ఉన్నాయా, వాటిలో హీమోగ్లోబిన్ శాతం తగినంత ఉన్నదా, లేదా అని క్లినికల్ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుటకు అవసరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.

హీమోగ్లోబిన్ సాధారణ స్థాయిలు

[మార్చు]
1 లీటరులో పదో వంతుని డెసీలీటరు అంటారు. 1 డెసీలీటరుని 1dL అని రాస్తారు.
  • పురుషులు: 13.8 నుంచి 18.0 గ్రాములు/డెసీలీటరు (138 నుంచి 180 గ్రాములు/లీటరు, or 8.56 to 11.17 mmol/L)
  • మహిళలు: 12.1 నుంచి 15.1 గ్రాములు/డెసీలీటరు (121 నుంచి 151 గ్రాములు/లీటరు, or 7.51 to 9.37 mmol/L)
  • పిల్లలు: 11 నుంచి 16 గ్రాములు/డెసీలీటరు (111 నుంచి 160 గ్రాములు/లీటరు, or 6.83 to 9.93 mmol/L)
  • గర్భిణీ స్త్రీలు: 11 నుంచి 14 గ్రాములు/డెసీలీటరు (110 నుంచి 140 గ్రాములు/లీటరు, or 6.83 to 8.69 mmol/L) [1][2]

మూలాలు

[మార్చు]
  1. Hemoglobin Level Test Archived 2007-01-29 at the Wayback Machine. Ibdcrohns.about.com (2013-08-16). Retrieved on 2013-09-05.
  2. Although other sources can have slightly differing values, such as haemoglobin (reference range) Archived 2009-09-25 at the Wayback Machine. gpnotebook.co.uk