రఘువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘు
పిల్లలుఅజుడు
తండ్రిదిలీపుడు
తల్లిసుదక్షిణ
రాజవంశంరఘువంశం, ఇక్ష్వాకులు, సూర్య వంశం
తరువాతి వారుఅజుడు
అంతకు ముందు వారుదిలీఫుడు

రఘువు ఇక్ష్వాకు వంశంలోని ప్రముఖ చక్రవర్తి.[1]

విశేషాలు[మార్చు]

రఘు అనే పదంలోని అక్షరాలలో "ర" అనాగా కాంతి, "ఘు" అనగా కదలిక. రఘు అనగా ప్రయాణిస్తున్న కాంతి అని అర్ధము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్ధము. ఇతని పేరుమీదనే 'రఘు వంశము' అని పేరుపొందింది. దిలీపుని కుమారుడు అజ మహారాజు. అజ మహారాజు కుమారుడు దశరథుడు. దశరథుని కుమారుడు శ్రీరాముడు. అనగా శ్రీరాముడు రఘువు యొక్క ముని మనుమడు.

మహాకవి కాళిదాసు రచించిన 'రఘు వంశము' లో ఈతని వంశపు వివరాలున్నాయి.

ప్రస్తుతం ట్రాన్స్ఆక్సానియా అని పిలువబడు ప్రాంతాన్ని రఘు మహారాజు తన సైన్యంతో దండెత్తి స్వాధీనపరచుకున్నాడు. ప్రాచీన భారతదేశం ఆక్సన్ నదిగా భావించే వంక్షు నది వరకు వెళ్ళగా అతనికి కాంభోజులు కనిపిస్తారు. వారు రఘు మహారాజుకు బహుమతులు, నిధులు సమర్పించుకున్నారు. ఆక్సస్ నది ప్రాంతం ఖర్జూర పండ్లకు అనువైనది అని కాళిదాసు రఘు వంశములో పేర్కొన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "రఘువంశము -1". మాలిక పత్రిక (in ఇంగ్లీష్). 2013-06-29. Retrieved 2020-09-17.
"https://te.wikipedia.org/w/index.php?title=రఘువు&oldid=3034132" నుండి వెలికితీశారు