రచ్చబండ (సమావేశ స్థలము)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A typical racchabanda under a tree (Sygezium Cumini) in the village of Rangapuram Khandrika, Chintalapudi Mandal, West Godavari District.

రచ్చబండ (Racchabanda) ఒక పెద్ద వృక్షం యొక్క మూలం చుట్టూ నిర్మించిన ఎత్తైన పీఠం. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఇతర భారతదేశపు పల్లెలలో ఎక్కువగా కనిపిస్తాయి. సామాన్యంగా ఇవి మర్రి లేదా రావి, చింత లేదా నేరేడు లాంటి భారీ వృక్షాల క్రింద నీడ కోసం కట్టిస్తారు. చారిత్రాత్మకంగా ఇవి ప్రాచీనకాలం నుండే వాడుకలో ఉన్నట్లు చెబుతారు.

ప్రాముఖ్యత[మార్చు]

రచ్చబండ ఆ గ్రామస్థులు కలుసుకొనే ప్రదేశంగా, వారి సమస్యలను చర్చించే వేదికగా, పంచాయతీ కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంగా, పిల్లలకు చదివించుకునేందుకు ఇలా చాలా రకాలుగా పనిచేస్తుంది.

ఆధునిక కాలంలో కూడా పల్లెలలోని పెద్ద వృక్షాల చుట్టూ ఇలాంటి రచ్చబండలు కనిపిస్తున్నాయి.