Jump to content

రణ్‌ధీర్ సావర్కర్

వికీపీడియా నుండి
రణ్‌ధీర్‌ సావర్కర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు హరిదాస్ భాడే
నియోజకవర్గం అకోలా ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-04-14) 1973 ఏప్రిల్ 14 (వయసు 51)
అకోలా, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రణధీర్ ప్రహ్లాదరావు సావర్కర్ (జననం 14 ఏప్రిల్ 1973) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు అకోలా ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రణ్‌ధీర్‌ సావర్కర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ మహాసంఘ్ అభ్యర్థి భాడే హరిదాస్ పండరిపై 2440 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంచిత్ బహుజన్ ఆఘడి అభ్యర్థి భాడే హరిదాస్ పండరిపై 24723 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రణ్‌ధీర్‌ సావర్కర్ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి గోపాల్ రాంరావ్ దట్కర్‌పై 50613 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Maharastra Assembly Election Results 2024 - Akola East". Election Commision of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.