బుద్ధులు
స్వరూపం
(రత్నసంభవుడు నుండి దారిమార్పు చెందింది)
వివిధ బౌద్ధ సంప్రదాయాలలో అనేక బుద్ధుల ప్రస్తావన ఉంది. "బోధీసత్వత" అనే నిర్వాణస్థితిని పొ౦దడం ఈ సంప్రదాయానికి మూలసూత్రం.
28 బుద్ధుల జాబితా
[మార్చు]ఇది బుద్ధవంశంలో చెప్పపడిన 28 బుద్ధుల జాబితా. పాళి బౌద్ధ సూత్రాలు గౌతమ బుద్ధుడు భూమిపై అవతరించే ముందే 28 బుద్ధులు అవతరించారని చెబుతున్నాయి. ఆ బౌద్ధ సూత్రాల ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుని అవతారం జరగబోతుంది.
సంస్కృత పేరు | పాళి పేరు | |
---|---|---|
1 | తృష్ణంకరుడు | తణ్హంకరుడు |
2 | మేధంకురుడు | మేధంకురుడు |
3 | శరణంకురుడు | సరణంకురుడు |
4 | దీపాంకురుడు | దీపాంకురుడు |
5 | కౌండిన్యుడు | కౌండిఞ్ఞుడు |
6 | మంగళుడు | మంగళుడు |
7 | సుమనసస్ | మననుడు |
8 | రైవతుడు | రేవతుడు |
9 | శోభితుడు | సోభితుడు |
10 | అనవదర్శిన్ | అనోమదస్సి |
11 | పద్ముడు | పదుముడు |
12 | నారదుడు | నారదుడు |
13 | పద్మొత్తరుడు | పదుముత్తరుడు |
14 | సుమేధుడు | సుమేధుడు |
15 | సుజాతుడు | సుజాతుడు |
16 | ప్రియదర్శిన్ | పియదస్సి |
17 | అర్థదర్శిన్ | అత్థదస్సి |
18 | ధర్మదర్శిన్ | ధమ్మదస్సి |
19 | సిద్ధార్థుడు | సిద్ధాత్థుడు |
20 | తిష్యుడు | తిస్సుడు |
21 | పుశ్యుడు | ఫుస్సుడు |
22 | విపశ్యిన్ | విపస్సి |
23 | శిఖిన్ | సిఖి |
24 | విశ్వభూ | వేస్సభూ |
25 | క్రకుచ్చండుదు | కకుసంధ |
26 | కనకముని | కొనకమనడు |
27 | కాశ్యపుడు | కస్సపుడు |
28 | గౌతముడు | గోతముడు |
- భవిష్యత్తులో మైత్రేయుడు
గౌతమ బుద్ధుడు
[మార్చు]- గౌతమ బుద్ధుడు చూడండి.
ఐదు ధ్యాని బుద్ధులు
[మార్చు]- అమితాభ బుద్ధుడు - అమితాభ బుద్ధుడు లేదా అమితాభుడు మహాయాన బౌద్ధములో ఐదు ధ్యాని బుద్ధులో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు సుఖవతి అని ఒక బుద్ధ క్షేత్రమును సృష్టించాడు. ఇతన్ని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగమునే సుఖవతి బౌద్ధము అని అంటారు. అమితాభ అంటే అమితమైన ప్రకాశము అని అర్థము. ఇతన్ని అమితాయుస్ అని కూడా అంటారు. - - అమితాభ బుద్ధుని దిశ పడమర. ఇతని స్కంధము సంజ్ఞా, రంగు ఎరుపు, చిహ్నము పద్మము. అమితాభుడు సాధరణంగా పద్మాసనములో ధ్యాన ముద్రతో ఉంటాడు. ఇతని ఎడమవైపు అవలోకితేశ్వరుడు, కుడివైపు మహాస్థామ ప్రాప్తుడు ఉంటారు. కాని వజ్రయాన బౌద్ధములో మహాస్థామప్రాప్తుడికి బదులుగా వజ్రపానిని చూడవచ్చు. - అమితాభుని మూల మంత్రము ఓం అమితాభ హ్రీః - హ్రీః అమితాభుని బీజాక్షరము
- మహావైరోచన బుద్ధుడు - మహాహావైరోచనుడు లేదా మహావైరోచన బుద్ధుడు మహాయాన బౌద్ధములో పూజించబడే ఐదు ధ్యాని బుద్ధులలో ఒకరు. మహావైరోచన బుద్ధుడు ఒక ధర్మకాయ బుద్ధుడు. మహావైరోచన బుద్ధుని రంగు శ్వేతము, ఆసనము పద్మాసనము, చిహ్నము సువర్ణ చక్రము లేదా సూర్య చక్రము, ముద్ర ధర్మచక్రము- మహావైరోచన బుద్ధుని మూల మంత్రము ఓం వైరోచన హూం - షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి జ్వాల మంత్రము అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము అమోఘపాశాకల్పరాజ సూత్రము అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము: - ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం - మహావైరోచనుని బీజాక్షరము 'అ'.
- అక్షోభ్య బుద్ధుడు : అక్షోభ్య బుద్ధుడు వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకడు. మహాయాన సూత్రముల ప్రకారము అక్షోభ్యుని లోకము వజ్రధాతుకి పశ్చిమ దశలో ఉన్న అభిరతి. ఇతన్ని ప్రజ్ఙకు లోచన అని పేరు. ఈ బుద్ధుని రంగు నీలము. ఈ బుద్ధుడు భూమిసప్రర్శ ముద్రతో కనిపిస్తాడు. మహాయాన బౌద్ధ సూత్రముల ప్రకారము, అక్షోభ్యుడు పూర్వజన్మములో అభిరతి మీద ఒక బుద్ధ భిక్షుగా ఉన్నాడు. భిక్షువుగా ఉన్నప్పుడు తనకు బోధి కట్టే వరకు అన్ని జీవుల మీద కోపము చూపించరాదు అని ప్రతిజ్ఙ తీస్కున్నాడు. ఈ ప్రతిజ్ఙను నెరవేర్చిన తర్వాత ఇతనికి బుద్ధభావము కిట్టి అభిరతి లోకముకి బుద్ధుడుగా అయ్యాడు. - ఈ బుద్ధుని మంత్రము: ఒం అక్షోభ్య హూం - ఇతని బీజాక్షరము హూం
- అమోఘసిద్ధి బుద్ధుడు - అమోఘసిద్ధి బుద్ధుడు ఐదు ధ్యాని బుద్ధుల్లో ఒకడు. అమోఘసిద్ధి బుద్దుని దిశ ఉత్తరము, రంగు పచ్చ. అమోఘసిద్ధి బుద్ధుడు మనుష్యల మధ్య ఉండే ఈర్ష్యను అంతం చేయడానికి సహాయం చేసేవాడు. అమోఘసిద్ధి బుద్ధుని మంత్రము ఓం అమోఘసిద్ధి ఆః హూం - ఈ బుద్ధుని బీజాక్షరము ఆః
- రత్నసంభవ బుద్ధుడు - రత్నసంభవ బుద్ధుడు, వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకరు. రత్నసంభవ బుద్ధుని దిశ దక్షిణము, రంగు పసుపు, భార్య మామకీ, ముద్ర వరదము. ఇతని మంత్రము - ఓం రత్నసంభవ త్రాం - ఈ బుద్ధుని బీజాక్షరము త్రాం
ఇతర బుద్ధులు
[మార్చు]- ఆదిబుద్ధుడు - బౌద్ధ సిద్ధాంతములో ఆదిబుద్ధుడు ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమే దేహంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ధర్మకాయ రూపుడు. సృష్టి ప్రారంభించక ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధుల నమ్మకము. వైరోచునుడు, అమితాభుడు, అక్షోభ్యుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అందరు బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. టిబెట్ బౌద్ధుములో వజ్రధారుని, సమంతభద్రుని ఆదిబుద్ధుడుగా భావిస్తారు.
- భైషజ్యగురు బుద్ధుడు - భైషజ్యగురు (Bhaisajyaguru), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు భైషజ్యగురు వైడూర్య ప్రభుడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ఔషధ బుద్ధుడు అని మరోక పేరు ఉంది. జపాన్ లో ఈ బుద్ధుని యకూషి అని అంటారు. ఈ బుద్ధుని లోకము వైడూర్య నిర్భాసము. - బైషజ్యగురు బుద్ధుని మంత్రాన్ని నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును ఔషధ బుద్ధుడు ధారణీ అని అంటారు. ఆ మంత్రము:
- ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ
- తద్యథా: ఓం
- భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా
- నైరాత్మ్యా నైరాత్మ్యా వజ్రయాన బౌద్ధములో ఒక స్త్రీ బుద్ధుడు. నైరాత్మ్యాను శూన్యతా దేవి, పుద్గల నైరాత్మ్యా అని కూడా అంటారు. నైరాత్మ్యా బౌద్ధ సిద్ధాంతమైన అనాత్మవాదాన్ని రూపంకంగా అనుకుంటారు. ఈ బుద్ధుని దేహము నీల రంగు.
- వజ్రధారుడు - వజ్రధారుడు తిబెత్ వజ్రయాన బౌద్ధ విభాగముకు చెందిన బుద్ధుడు. తిబెత్ బౌద్ధము ప్రకారము ఇతన్నే ఆధిబుద్ధుడు. వజ్రధారుడు, సమంతభద్రుడు ఒకే లక్షణాలు ఉన్న వేరు వేరు బుద్ధులు. సాధరంగా వజ్రధారుడు అలంకారము ఏమి లేని స్థితిలో ఉంటాడు. బౌద్ధ సిద్ధాంతము ప్రకారము వజ్రధారుడు ఒక ధర్మకాయ బుద్ధుడు - వజ్రధారుని మంత్రము: ఒం ఆః వజ్రధార హూం