Jump to content

రమణ. ఎమ్.వి.

వికీపీడియా నుండి

వీరు, శ్రీమతి భానుమతి, వెంకటేశ్వరరావు దంపతులకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించారు. తన పదవ ఏట ‘చక్రధారి’ నాటకంలో పాండురంగని పాత్రతో రంగస్థల నటనకు శుభారంభం పలికారు. తన గురువు పి. సత్యనారాయణ రెడ్డి దర్శకత్వంలో ‘వల్లీ కళ్యాణం’ నాటకంలో ‘లక్ష్మి’ పాత్ర పొషించి ప్రశంసలందుకొన్నారు. పిచ్చమ్మ, చాత్రాంగి, రుక్మిణి పాత్రలు కూడా ఈవిడకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఎన్నో పౌరిణిక, చారిత్రాత్మక, సాంఘిక నాటక/నాటికలలో పాత్రలు ధరించిన ఈమె, పరిషత్తులనండి అనేకసార్లు ‘ఉత్తమనటి’ బహుమతులను అందుకున్నారు. గీతా కళామందిర్ – భారతీ అసోసియేట్స్ (తణుకు) అధ్యక్షురాలైన ఈవిడ ఆ సంస్థ తరపున అందరూ స్త్రీలే ప్రదర్శించిన ‘భక్త చింతామణి’లో చింతామణిగా, ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామగా, ‘సత్యహరిశ్చంద్ర’లో చంద్రమతిగా నటించారు. అంతేకాకుండా ‘చావకూడదు’లో మహిళామండలి ప్రెసిడెంట్ గా, ‘రాలిపోని అకు’లో ప్రధాన పాత్రను పోషించి బహుమతులు పొందారు. కీ.శే. షణ్ముఖి ఆంజనేయరాజు, ఎ. కోటేశ్వరరావు, ఆర్.ఎ. నాయుడు, ప్రగడ నాగేంద్రలాంటి రంగస్థల ప్రముఖుల సరసన ప్రధాన పాత్రలు ధరించారు.

మూలాలు

[మార్చు]

రమణ. ఎమ్.వి., కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 71.