రమేశ్ కార్తిక్ నాయక్
రమేశ్ కార్తిక్ నాయక్ | |
---|---|
![]() 2023 జనవరిలో రమేశ్ కార్తీక్ నాయక్ | |
జననం | నునావత్ కార్తిక్ 14 డిసెంబర్ 1997 వివేక్ నగర్ తండా , జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ప్రసిద్ధి | తెలుగు సాహితీకారుడు |
తండ్రి | నుణావత్ మోజిరాం |
తల్లి | సేవంతా బాయి |
రమేశ్ కార్తిక్ నాయక్, తెలంగాణకు చెందిన వర్ధమాన సాహిత్యకారుడు. వచనకవిత్వం, కథ ప్రక్రియల్లో కృషి చేస్తున్నాడు.
జననం - బాల్యం[మార్చు]
రమేశ్ కార్తిక్ నాయక్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం వివేక్ నగర్ తండా (జక్రాన్ పల్లి తండా) లో నుణావత్ మోజిరాం, సేవంతా బాయి దంపతుల మొదటి సంతానంగా 1997లో డిసెంబరు 14న జన్మించాడు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. రమేశ్ కార్తిక్ నాయక్ అసలు పేరు నునావత్ కార్తిక్. తనకెంతో ఆత్మీయుడైన మిత్రుడు రమేశ్ పేరును అభిమానంతో తన పేరుకు ముందు జతపరుచుకున్నాడు.
విద్యాభ్యాసం[మార్చు]
కార్తిక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానికంగానే చదివాడు. ఆరు నుంచి పదో తరగతి వరకు బోధన్‌లోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివి నేరుగా టీటీసీ శిక్షణకు వెళ్లాడు. ఇంటర్ నుంచి తనలో ఉన్న జిజ్ఞాసకు అక్షర రూపం ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం English and foreign languages University లో certificate of proficiency in Spanish language కోర్సు చేస్తున్నాడు.
సాహితీ కృషి[మార్చు]
కార్తిక్‌నాయక్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాయడం మొదలు పెట్టాడు. పదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవడింది. తన మొదటి కవితా సంపుటికి 2014లోనే శ్రీకారం చుట్టాడు. తను చూసిన సంఘటనలు, మనుషులతోపాటు పుస్తకాలు సేకరించి చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకొని పూర్తి చేశాడు.
గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించాడు. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త దారుల్ని వెతుకుతుంటే ‘మావాళ్లు’ ఇంకా అవే నమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ గతంలోనే జీవిస్తున్నారని మదనపడ్డాడు. తను చూసిన బతుకుల్ని, వెతల్ని, కథల్ని కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. తన గుప్పెడంత గుండెలోంచి గంపెడంత కవిత్వాన్ని తీసి ఎన్నో వన్నెచిన్నెలు అద్దాడు. అలా పొదిగి అద్దిన ‘బల్దేర్ బండి’ కవితా సంపుటిని 2018లో ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
రమేశ్ కార్తిక్ నాయక్ రాసిన మొదటి పుస్తకానికే అనేక ప్రశంసలు అందాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన విద్యా సదస్సులో సన్మానం పొందారు. ఖమ్మంలో నవ స్వరాంజలి సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. బల్దేర్ బండిలోని జారేర్ బాటి(జొన్నరొట్టెలు) అనే కవితను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు తెలుగు సాహిత్యంలో ఒక పాఠంగా పొందుపరిచారు.[1]
ప్రచురించిన పుస్తకాలు[మార్చు]
- బల్దేర్ బండి (వచన కవితా సంపుటి) - 2018[2]
- ‘ఢావ్లో’ కథల సంపుటి, గోర్ బంజారా కతలు - 2021[3]
- కేసులా, తొలి గోర్ బంజారా కథలు( సహసంపాదకీయం ఆచార్య సూర్యాధనంజయ్ తో కలిసి) 2022.
పొందిన అవార్డులు[మార్చు]
- కలహంస పురస్కారం - 2017
- తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం ( బోధన్) - 2018
- మువ్వా రంగయ్య ఫౌండేషన్ వారి నవస్వరాంజలి - 2019
- చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహితీ పురస్కారం - 2019
- బీ. ఎస్. రాములు ప్రతిభా పురస్కారం - 2020
- బంజారా యూత్ ఐకాన్ అవార్డ్ - 2021 - 2021[4]
మూలాలు[మార్చు]
- ↑ "Chakmak to throw light on Lambadas and loneliness". The New Indian Express. 2020-06-16. Archived from the original on 2022-06-16. Retrieved 2022-09-10.
- ↑ krishna (2019-04-25). "ఇప్పపూవులోని తేనెబిందువు 'బల్దేర్‌బండి'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.
- ↑ Mana Telangana (26 September 2021). "కథకు పట్టిన కుబుసం రాలగొట్టిన ఢావ్లో". manatelangana. Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
- ↑ pratapreddy (2021-02-12). "రమేశ్ కార్తిక్ నాయక్ కు బంజారా యూత్ ఐకాన్ 2021 అవార్డ్". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2021-06-20. Retrieved 2022-09-10.