రమేష్ చెన్నితాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేరళ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 జూన్ 2011 (2011-06-01)
ముందు బాబు ప్రసాద్
నియోజకవర్గం హరిపాడ్ శాసనసభ నియోజకవర్గం

కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
2016 మే 29 – 2021 మే 20
గవర్నరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
ముందు వి.ఎస్. అచ్యుతానందన్
తరువాత వి.డి. సతీషన్

కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రి
పదవీ కాలం
2014 జనవరి 1 – 2016 మే 20
ముందు టి. రాధాకృష్ణన్
తరువాత పిన‌ర‌యి విజ‌య‌న్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-25) 1956 మే 25 (వయసు 68)
మావేలికర , కేరళ భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రామకృష్ణ నాయర్

దేవకి అమ్మ

జీవిత భాగస్వామి
అనిత రమేష్
(m. 1986)
[1]

రమేష్ చెన్నితాల,, (జననం 1956 మే 25) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు రమేష్ 14వ కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు.[2] రమేష్ కేరళ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు పాటు కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. 28 సంవత్సరాల వయస్సులో కేరళ అతి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసి ఆయన రికార్డు సృష్టించారు.[3]

చెన్నితాల కొట్టాయం, మావెలిక్కర లోక్ సభ నియోజకవర్గాల నుండి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఎంపీగా పనిచేశాడు, హరిపాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి రమేష్ చెన్నితాల ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రమేష్ చెన్నితాల కేరళ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేశాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రమేష్ చెన్నితాల నిర్వహించాడు. కేరళ రాష్ట్రం నుండి ఈ పదవి పొందిన ఏకైక వ్యక్తి ఆయనే‌. రమేష్ చెన్నితాల 2004లో భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రాతినిధ్యం వహించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమేష్ చెన్నితాల 1956 మే 25న భారతదేశంలోని కేరళలోని చెన్నితాలలో వి. రామకృష్ణన్ నాయర్ దేవకియమ్మ దంపతులకు జన్మించారు.[4] రమేష్ చెన్నితాల ఎకనామిక్స్ ఎల్ఎల్బీ బీఏ డిగ్రీని అభ్యసించారు.[5] రమేష్ చెన్నితాల అనితను వివాహం చేసుకున్నాడు.[6] ఈ దంపతులకు రోహిత్ చెన్నితాల, రమిత్ చెన్నితాల అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. రోహిత్ చెన్నితాల వృత్తిరీత్యా వైద్యుడు రమిత్ చెన్నితల సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017 పాల్గొని 210వ ర్యాంకు సాధించాడు.[7][8]

రాజకీయ జీవితం

[మార్చు]
ఆసియాలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం అయిన కేరళ స్కూల్ కలోల్సవం విజేతలకు గోల్డెన్ ట్రోఫీని ప్రదానం చేస్తున్న చెన్నితల.
యుఎఇ నుండి ప్రతినిధులతో పాటు రమేష్ చెన్నితాల.

రమేష్ చెన్నితాల తన రాజకీయ జీవితాన్ని తన పాఠశాల రోజుల్లోనే ప్రారంభించాడు. 1970లో ఆయన కేరళ విద్యార్థి సంఘానికి కార్యదర్శి అయ్యాడు. తదనంతరం రమేష్ చెన్నితాల కేరళ విద్యార్థి సంఘంలో వరుస పదవులను నిర్వహించారు, 1971లో రమేష్ చెన్నితాల మావెలిక్కర తాలూకా విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి అయ్యారు, 1972లో రమేష్ చెన్నితాల అలప్పుజ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, 1973లో అలప్పుజల్ విద్యార్థి సంఘ కార్యదర్శిగా నియమితుడయ్యాడు, 1975లో కేరళ విద్యార్థి సంఘం కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేశాడు, 1978లో కేరళ రాష్ట్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు 1980లో కేరళ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అయ్యాడు .[9]

1982లో, రమేష్ చెన్నితాల అఖిలభారత విద్యార్థి సంఘం అధ్యక్షుడయ్యారు, తరువాత అదే సంవత్సరంలో హరిపాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో, ఆయన భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు, 1986లో 28 సంవత్సరాల వయస్సులో కె. కరుణాకరన్ మంత్రి వర్గంలో అతి అతి చిన్న వయసులోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు.[9] 1986లో రమేష్ చెన్నితాల కేరళ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (కేరళ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, 1987లో హరిపాడ్ శాసనసభని యోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][9]

1989లో రమేష్ చెన్నితాల కొట్టాయం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు, ఎంపీగా ఎన్నికైన తర్వాత 1990లో భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు.[10] రమేష్ చెన్నితాల 1999లో మావెలిక్కర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండవసారి ఎంపీగా గెలిచాడు. 2004 భారత సాధారణ ఎన్నికలలో పోటీ చేసి రమేశ్

చెన్నితాల సిపిఐ (ఎం) నాయకురాలు అడ్వ. సి. ఎస్. సుజాత చేతిలో ఓడిపోయారు.[11]

తరువాత రమేష్ చెన్నితాల 1991,1996 1999 వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు.[10] రమేష్ చెన్నితాల తన పదవీకాలంలో భారత పార్లమెంటులో హిందీ, ఇంగ్లీష్ భాషలలో చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగాలకు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. 2001లో రమేష్ చెన్నితాల ఏడు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేశాడు, 2002లో ఐదు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. 2004లో, ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][10]

రమేష్ చెన్నితాల మహాత్మా గాంధీ 125వ జయంతి కోసం పలు కమిటీలకు జాతీయ సభ్యుడిగా పనిచేశాడు. వాణిజ్య కమిటీ సభ్యుడు, కార్మిక, సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు, సుభాష్ చంద్రబోస్ ఆర్థిక కమిటీ-లోక్ సభ-హెచ్. ఆర్. డి. స్టాండింగ్ కమిటీ షబ్బీడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, కాయర్ బోర్డు, పౌర విమానయాన సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా, ఇలా అనేక కమిటీలకు జాతీయ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ఎంపీగా ఉన్న కాలంలో భారత పార్లమెంటులో కేరళ రాష్ట్ర హక్కుల కోసం పలు పోరాటాలు చేశారు. పార్లమెంటులో కేరళ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేవారు. రమేష్ చెన్నితాల తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను నిర్వహించాడు . కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా కూడా పనిచేశాడు, ఏఐసీసీ కార్యదర్శి, గా కొంతకాలం పనిచేశాడు. ఆయన శాసనసభకు అయిదు సార్లు పార్లమెంటుకు నాలుగు సార్లు ఎన్నికయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. "Parlement of India". parliamentofindia.nic.in. Retrieved 2020-12-25.
  2. "Ramesh Chennithala elected as new opposition leader". Times of India. 29 May 2016. Retrieved 2016-05-30.
  3. "Congress Elects Ramesh Chennithala As Leader Of Opposition In Kerala Assembly". NDTV.com. Retrieved 2022-02-14.
  4. "Kerala Assembly election database: Biodata of Ramesh Chennithala". keralaassembly.org. Archived from the original on 2024-05-18. Retrieved 2022-02-14.
  5. "KERALA LEGISLATURE - MEMBERS". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  6. "Kerala Opposition leader Ramesh Chennithalas wife Anitha about their wedding". Times of India.
  7. "Ramesh Chennithala's son ties the knot". Mathrubhumi.
  8. "State's top rank in Civil Services is 16". The Hindu.
  9. 9.0 9.1 9.2 "Congress Elects Ramesh Chennithala as Leader of Opposition in Kerala Assembly". NDTV. 30 May 2016.
  10. 10.0 10.1 10.2 "Chennithala elected as CLP leader in Kerala". India Today. 29 May 2016.
  11. "General elections 2019: All eight Kerala women to become Lok Sabha MPs". The New Indian Express. Retrieved 2021-05-24.