రసాయన ప్రతిచర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rusting iron
A bonfire is an example for redox

రసాయన ప్రతిచర్య అనేది ఒకటి లేదా ఎక్కువ రసాయనాలు ఒకటి లేదా ఎక్కువ ఇతర రసాయనాల లోకి మార్చబడినప్పుడు జరుగుతుంది. ఉదాహరణలు:

  • ఇనుము, ఆక్సిజన్ కలయిక వలన తుప్పు పడుతుంది.
  • వెనిగర్, బేకింగ్ సోడా కలయిక నుంచి సోడియం ఎసిటేట్, కార్బన్ డయాక్సైడ్, నీరు తయారవుతుంది.
  • వస్తువులు కాలుతాయి లేదా పేలుతాయి
  • ప్రాణుల లోపల అనేక ప్రతిచర్యలు జరుగుతుంటాయి

కొన్ని ప్రతిచర్యలు చాలా వేగంగా, కొన్ని ప్రతిచర్యలు చాలా నెమ్మదిగా ఉంటాయి. కొన్ని ఉష్ణోగ్రత లేదా ఇతర విషయాలపై ఆధారపడి వేర్వేరు వేగాలతో ప్రతిచర్యలు జరుపుతాయి. ఉదాహరణకు, చెక్క చల్ల గాలులు వీస్తున్నప్పుడు తొందరగా అంటుకోదు, అదే వేడి గాలులు వీస్తున్నప్పుడు తొందరగా అంటుకుంటుంది. అణు ప్రతిచర్యల వంటి ఇతర ప్రతిచర్యలు విభిన్నంగా ఉంటాయి, అణు చర్యలలో ఉత్ప్రేరకం అవసరం లేదు. వీటిని హఠాత్తుగా ఆపడం, వేగవంతం చేయడం లేదా నెమ్మది చేయడం కూడా సాధ్యం కాదు. కొన్ని ప్రతిచర్యలు శక్తిని ఇస్తాయి. దీనిని ఉష్ణమోచక ప్రతిచర్య అంటారు. ఇతర ప్రతిచర్యలు శక్తిని తీసుకుంటాయి. దీనిని ఉష్ణగ్రాహక ప్రతిచర్య అని అంటారు.

నాలుగు ప్రాథమిక రకాలు[మార్చు]

The four basic chemical reactions types: synthesis, decomposition, single replacement and double replacement