Jump to content

రసిక్ మోహన్ చక్మా

వికీపీడియా నుండి
రసిక్ మోహన్ చక్మా
రసిక్ మోహన్ చక్మా


చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
22 మే 2023
పదవీ కాలం
9 అక్టోబర్ 2021 – 2 జూన్ 2022
ముందు దుర్జ్య ధన్ చక్మా
తరువాత బుద్ధ లీలా చక్మా
నియోజకవర్గం బోరపంసూరి I

ఎమ్మెల్యే 2003-2006
పదవీ కాలం
2003 – 2006
ముందు నిరుపమ్ చక్మా
తరువాత బుద్ధ ధన్ చక్మా
నియోజకవర్గం తుచాంగ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023-2026 – 2026
ముందు బుద్ధ ధన్ చక్మా
నియోజకవర్గం తుచాంగ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్
పూర్వ విద్యార్థి నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ
వెబ్‌సైటు www.cadc.gov.in

రసిక్ మోహన్ చక్మా మిజోరాం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మిజోరం లోని స్వయంప్రతిపత్త ప్రాంతమైన చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చీఫ్‌గా నియమితుడై[1] ఆ తరువాత 2023 శాసనసభ ఎన్నికలలో తుచాంగ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రసిక్ మోహన్ చక్మా 1993 నుండి బోరపన్సూరి నియోజకవర్గం నుండి మిజోరం శాసనమండలి సభ్యునిగా ఐదు సార్లు ఎన్నికయ్యాడు.అతను 2003లో చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పదవిలో ఉండగా రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రసిక్ మోహన్ చక్మా శాసనమండలి సభ్యునిగా కొనసాగడానికి 2006లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.  చక్మా 2018 ఎన్నికలలో చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చీఫ్‌గా తిరిగి ఎన్నికై 2018 మార్చి 29న స్వచ్ఛంద కారణాలతో రాజీనామా చేశాడు.[2] అతను మిజోరంలోని స్వయంప్రతిపత్త ప్రాంతమైన చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చీఫ్‌గా నియమితుడై[3] ఆ తరువాత 2023 శాసనసభ ఎన్నికలలో తుచాంగ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (26 May 2023). "MNF leader Rasik Mohan Chakma sworn-in as CEM of Chakma Autonomous District Council". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  2. "Chakma council CEM Rasik Mohan Chakma resigns". 30 March 2021. Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  3. ThePrint (26 May 2023). "MNF leader Rasik Mohan Chakma sworn-in as CEM of Chakma Autonomous District Council". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  4. The Times of India (4 December 2023). "Tuichawng assembly election result 2023: MNF's Rasik Mohan Chakma wins with 13346 votes, defeating BJP's Durjya Dhan Chakma and INC's Hara Prasad Chakma". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.

బాహ్య లంకెలు

[మార్చు]