రాంబో
ర్యాంబో: ఫస్ట్ బ్లడ్ | |
---|---|
దర్శకత్వం | టెడ్ కొట్చెఫ్ |
స్క్రీన్ ప్లే | Michael Kozoll William Sackheim Sylvester Stallone |
నిర్మాత | Buzz Feitshans Mario Kassar Andrew G. Vajna |
తారాగణం | సిల్వెస్టర్ స్టాలోన్ రిచర్డ్ క్రెన్నా బ్రియన్ డెన్నె |
ఛాయాగ్రహణం | ఆండ్రూ లాస్జ్లో |
కూర్పు | Joan E. Chapman |
సంగీతం | జెర్రి గోల్డ్ స్మిత్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఓరియన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | అక్టోబర్ 22, 1982 |
సినిమా నిడివి | 97 నిమిషాలు |
దేశం | మూస:యూఎస్ చలనచిత్రం |
భాష | ఆంగ్లము |
బడ్జెట్ | $14 మిలియన్ |
బాక్సాఫీసు | $125,212,904 |
1982లో సిల్వెస్టర్ స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. జాన్ రాంబో గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్య ద్వారా తెలుసుకుంటాడు. చిత్రం ప్రారంభంలో రాంబో(స్టాలోన్) చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్ పై నడచి వస్తుంటాడు. అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు. అతడు చెప్పిన ప్రదేశానికి తను తీసుకువెలతానని చెప్పి తన పోలీసు కారులో పొలిమేరలో దింపుతాడు నిజానికి రాంబో సిటీకి వెళ్లాలనుకుంటాడు అందువలన పోలీసు అధికారి దించిన ప్రదేశం నుండి తిరిగి వెనక్కి రావడం అధికారి గుర్తిస్తాడు అందువలన అతడు మరల వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు. అది ఎందుకు అని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీసు స్టేషనుకు తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తుచేసుకుని తిరగబడతాడు. అతడు పోలీసు స్టేషను నుండి తప్పించుకుని బైకుపై పారిపోయే క్రమంలో పోలీసు అధికారి చేదనలో సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తరువాత అతడు అడవిలోకి పారిపోయి గుహలో తలదాచుకుంటాడు. అతడిపై కోపోద్రిక్తుడైన పోలీసు అధికారి ఎలాగైనా పట్టి తీరాలనుకుని పోలీసు బలగాలను ఉపయోగిస్తాడు. చివరకు ఆర్మీ సహాయం కూడా తీసుకుంటాడు కానీ రాంబో తన యుద్ధ నైపుణ్యాన్ని కనపరచి ఎదురుదాడి చేసి తప్పించుకుంటాడు. చివరకు పోలీసు అధికారిని చంపివేయాలనుకుంటాడు, పోలీస్ స్టేషను లోకి ప్రవేశించి అధికారిపై తూటా ఎక్కుపెడతాడు కానీ తన సైనిక శిక్షకుడు(గురువు) జోక్యంతో లొంగిపోతాడు.