Jump to content

రాకేశ్ టికాయత్

వికీపీడియా నుండి
రాకేష్‌ టికాయత్‌
జననం (1969-06-04) 1969 జూన్ 4 (వయసు 55)
విద్యచౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ (ఏం,ఏ, ఎల్‌ఎల్‌బీ)[2]
వృత్తిరైతు
భారతీయ కిసాన్‌ యూనియన్‌
జీవిత భాగస్వామి
సునీతా దేవి
(m. 1985)
పిల్లలు3
తల్లిదండ్రులుమహేంద్ర సింగ్ టికాయత్‌ ]]

రాకేష్‌ టికాయత్‌ భారతదేశానికి చెందిన రైతు ఉద్యమ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాడు.[3][4]

వృత్తి

[మార్చు]

రాకేష్‌ టికాయత్‌ యూనివర్శిటీ నుండి ఏం.ఏ, ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ఆయన 1992లో ఢిల్లీ పోలీస్‌లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి తరువాత సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. టికాయత్‌ తరువాత రైతు ఉద్యమాల్లో భాగంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌లో చేరి అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాకేష్‌ టికాయత్‌ 2007లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఖతౌలీ స్థానం నుండి బహుజన్ కిసాన్ దళ్ (BKD) పార్టీ తరపున ( కాంగ్రెస్ మద్దతుతో) అభ్యర్థిగా పోటీ చేసి ఆరో స్థానంలో నిలిచాడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికలలో అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం నుండి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు.

2020 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం

[మార్చు]

భారత కేంద్ర ప్రభుత్వం ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం 2020, రైతుల (సాధికారత & రక్షణ) ఒప్పందం, రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్యం (ప్రమోషన్ & సులభతరం) చట్టం 2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టాలను 2020ను తెచ్చింది. వీటిని ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న 40 రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దులోని తిక్రీ, సింగు, ఘాజీపూర్ వద్ద 2020 నవంబరు 26 నుండి నిరసనలు చేపట్టారు. రాకేశ్ టికాయత్ ఉద్యమం నీరుకారిపోతున్న సమయంలో తన ఉద్వేగభరిత ప్రసంగాలతో నిరసనకారుల్లో మళ్లీ ఉత్తేజాన్ని నింపి, ప్రభుత్వంతో చర్చల్లోనూ కీలకపాత్ర పోషించాడు.

దేశంలోని రైతుల ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చి 2021 నవంబరు 19న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాడు. దేశ ప్రజలకు, రైతులకు ప్రధాన మంత్రి ఈ సందర్భంగా క్షమాపణలు కోరాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana, NT News (15 December 2021). "383 రోజుల త‌ర్వాత ఇంటికి రాకేశ్ టికాయ‌త్". Archived from the original on 3 March 2022. Retrieved 3 March 2022.
  2. "राकेश टिकैत: मेरठ यूनिवर्सिटी से LLB, किसानों के लिए छोड़ी Delhi Police की नौकरी, 44 बार जा चुके हैं जेल" [Rakesh Tikait: LLB from Meerut University, left Delhi Police job for farmers, has gone to jail 44 times]. Zee Uttar Pradesh Uttarakhand (in హిందీ). 28 January 2021.
  3. Sakshi (20 November 2021). "విజయ సారథులు వీరే". Archived from the original on 3 March 2022. Retrieved 3 March 2022.
  4. The Indian Express (30 January 2021). "A breakdown, and the rise of farmer leader Rakesh Tikait" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2022. Retrieved 3 March 2022.
  5. Namasthe Telangana (1 December 2021). "మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  6. NTV (19 November 2021). "మూడు వ్యవసాయ చట్టాలు రద్దు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.