రాజన్ ప్రభాకర్ సాల్వి
| రాజన్ ప్రభాకర్ సాల్వి | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2009 - 23 నవంబర్ 2024 | |||
| ముందు | గణపత్ కదమ్ | ||
|---|---|---|---|
| తరువాత | కిరణ్ సమంత్ | ||
| నియోజకవర్గం | రాజాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాజన్ ప్రభాకర్ సాల్వి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజన్ ప్రభాకర్ సాల్వి శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కదమ్ గణపత్ దౌలత్ పై 24141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ యశ్వంత్ పై 39062 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
రాజన్ ప్రభాకర్ సాల్వి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అవినాష్ శాంతారామ్ లాడ్ పై 11876 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2024 ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి కిరణ్ సమంత్ చేతిలో 19677 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (2 July 2022). "Maharashtra political crisis | Embattled MVA fields Sena's Rajan Salvi as its Speaker candidate" (in Indian English). the original నుండి 1 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 December 2024.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Rajapur". the original నుండి 1 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 December 2024.