రాజరథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజరథం
దర్శకత్వంఅనూప్ భండారి
రచనఅనూప్ భండారి
నిర్మాతఅజయ్ రెడ్డి
విషు దకప్పగారి
అంజు వల్లభ్
సతీష్ శాస్త్రి
తారాగణంనిరూప్‌ బండారి
అవంతిక శెట్టి
ఆర్య
రవిశంకర్‌
Narrated byపునీత్ రాజ్‍కుమార్
ఛాయాగ్రహణంవిలియం డేవిడ్
సంగీతంనేపధ్య సంగీతం:
అజనీష్ లోక్‌నాథ్‌
పాటలు:
అనూప్‌ బండారీ
నిర్మాణ
సంస్థ
జాలీహిట్స్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2018 మార్చి 23 (2018-03-23)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజరథం 2018లో తెలుగులో విడుదలైన కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మించిన ఈ సినిమాకు అనూప్‌ బండారీ దర్శకత్వం వహించాడు. నిరూప్‌ బండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవిశంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 23న విడుదలైంది.[1]

కథ[మార్చు]

అభి(నిరూప్ బండారి) ఇంజనీరింగ్ స్టూడెంట్ అదే కాలేజ్‌లో చదివే మేఘ శ్రీధర్ (అవంతిక శెట్టి)ను నాలుగేళ్ళు ఇష్టపడుతూ తన ప్రేమను వ్యక్త పరచడానికి ఇబ్బంది పడుతాడు. వారి చదువు పూర్తవ్వడంతో బెంగుళూరుకి బయలుదేరతాడు, అతను వెళ్తున్న బస్‌లోనే పక్క పక్క సీట్లలో మేఘ కూడా ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరితో మరొకరికి పరిచయం ఏర్పడుతుంది. మరి వీరి పరిచయం ప్రేమగా మారిందా..? వీరిద్దరికి అధికార పార్టీకు చెందిన నాయకుడు విశ్వ(ఆర్య) కు సంబంధం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • నిరూప్‌ బండారి[2]
  • అవంతిక శెట్టి
  • ఆర్య
  • రవిశంకర్‌
  • వినయ ప్రసాద్
  • ఎం. జి. నరేష్
  • శ్రీవత్స
  • సంజయ్ సూరి
  • సుధాకర్ సాజా
  • అరుణ బాలరాజ్
  • శృతి హరిహరన్
  • అనూప్ భండారి
  • రానా దగ్గుబాటి - డబ్బింగ్‌[3]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జాలీ హిట్స్ ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనూప్ భండారి
  • సంగీతం: అజనీష్ లోక్‌నాథ్‌
    అనూప్‌ బండారీ
  • సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 February 2018). "మార్చి మూడోవారంలో 'రాజరథం'". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  2. Sakshi (22 March 2018). "రాజరథం కోసం తెలుగు నేర్చుకున్నా". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  3. Sakshi (29 December 2017). "నేను కనిపించను.. వినిపిస్తాను – రానా". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాజరథం&oldid=4007792" నుండి వెలికితీశారు