రాజస్థాను కథావళి
Jump to navigation
Jump to search
రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశులుగా ఉనికిలోనే ఉన్నారు. వీరిలో మగవారి శౌర్యం, ధైర్యం, పోరాటపటిమలను, స్త్రీల మానసంరక్షణ, ఉన్నత నడవడికలను ఉత్తర భారతదేశ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కథలను సేకరించి, సరళమైన భాషలో చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగు పాఠకులకు అందించారు ఈ పుస్తకంలో. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినవి కాదు. అంతమాత్రాన అన్నీ కల్పితాలు, అతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్ర, కల్పన, అతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి.