Jump to content

రాజావారి చేపల చెరువు

వికీపీడియా నుండి
రాజావారి చేపల చెరువు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం పోసాని కృష్ణ మురళి
తారాగణం పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, గైనా
విడుదల తేదీ 15 మే 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

'రాజావారి చేపల చెరువు' తెలుగు చలన చిత్రం,2009 మే,15 న విడుదల.ఈ చిత్రానికీ పోసాని కృష్ణమురళి దర్శకుడు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కన్నెగంటి బ్రహ్మానందం,గైనా మొదలగు వారు నటించారు.[1]

ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి నిర్వహించారు

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పోసాని కృష్ణమురళి
  • విడుదల:15:05:2009.

'ఆపరేషన్ దుర్యోధన'ను గుర్తు చేసేలా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తనను ఇబ్బంది పెట్టిన పై అధికారులకు, రాజకీయనాయకులకు తెలివిగా బుద్ది చెప్పటమే ఈ చిత్ర కధాంశం. లోకల్ ఎమ్మల్యే తమ్ముడు తనను రిజెక్టెడ్ చేసినందుకు ఓ అమ్మాయి కళ్ళు పోగెడతాడు. అవినీతిని సహించలేని పవర్ ఫుల్ ఎస్సై రాజా(పోసాని) ఆ కేసును టేకప్ చేస్తాడు. ఎమ్మల్యే తమ్ముడు(కళ్ళు పోగెట్టాడని)అతని కళ్ళు బలవంతంగా తీసి ఆ అమ్మాయికి పెట్టించి న్యాయం చేస్తాడు. దాంతో పగపట్టిన ఎమ్మల్యే..రాజా ఉద్యోగాన్ని, అతని భార్య(గైనా) గర్భకోశాన్ని తీసేసి పగ తీర్చుకుంటాడు. ఆ స్ధితిలో రాజా బ్రతుకు తెరువు కోసం ఎందరికో లంచాలు అవీ ఇచ్చి ఓ చేపల చెరువు పెట్టుకుంటాడు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న స్ధితిలో తన అందమైన చేపలు చెరువును ఎవరో కిడ్నాప్ చేసారంటూ రాజా పోలీస్ స్టేషన్ కి వెళతాడు. వాళ్ళు ఆ కేసు నమోదు చేసుకోరు. అప్పుడు మీడియా వారి సాయంతో ఆ కేసును రిజస్టర్ చేస్తాడు. ఆ తర్వాత ఆ చేపల చెరువు ని ఎవరు కిడ్నాప్ చేసారు..పోలీసులు పట్టుకోలగిలిగారా..అసలేం జరిగింది అనేది మిగతా కథ.

ఆదరణ

[మార్చు]

"మెంటల్ కృష్ణ పాత్రలో అతిగా చేసిన తర్వాత, పోసాని ఈసారి సంయమనంతో కూడిన ప్రదర్శన ఇచ్చాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక విమర్శకుడు రాశాడు.[2] ఫుల్ హైదరాబాద్‌కు చెందిన ఒక విమర్శకుడు "చెడ్డ సినిమాలు, చెత్త సినిమాలు ఉన్నాయి, కానీ నిజంగా అభ్యంతరకరంగా ఉండటానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు. మీరు ఎప్పుడైనా ఇందులో చిక్కుకుంటే, మేము చెప్పేదల్లా, దానిని వదిలించుకుని మర్చిపోండి" అని.[3]

మూలాలు

[మార్చు]
  1. "Rajavari Chepala Cheruvu (2009)". Indiancine.ma. Retrieved 2025-08-21.
  2. "Rajavari Chepala Cheruvu Movie Review". The Times of India. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
  3. Garimella, Deepa. "Rajavari Chepala Cheruvu Review". Full Hyderabad. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.

బాహ్య లంకెలు

[మార్చు]