రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి
రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | సత్య రాజ్ |
రచన | సత్య రాజ్ |
నిర్మాత | ముత్యాల రామదాసు, నున్నా కుమారి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మురళీకృష్ణ వర్మన్ |
కూర్పు | కిషోర్ తిరుమల |
సంగీతం | రోషన్ సాలుర్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 9 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి 2024లో విడుదలైన తెలుగు సినిమా. తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ బ్యానర్‌పై రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మించిన ఈ సినిమాకు సత్య రాజ్ దర్శకత్వం వహించాడు. రవితేజ నున్న, నేహ జురెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసి[1], సినిమాను మార్చి 9న విడుదలైంది.[2]
కథ
[మార్చు]కర్ణ(రవితేజ నున్న) ఊరిలో ఆవరాగా తిరిగే కుర్రాడు. ఊర్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న నాయుడు (నాగినీడు) గారి అబ్బాయి. అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను (నేహా జురెల్) ని చూసి కర్ణ ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య మంచి సంబంధం బలపడుతున్న సందర్భంలో అనుతో కర్ణ శారీరికంగా దగ్గర అవ్వాలి అనుకుంటాడు. దానికి అను తిరస్కరిస్తుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఈ హత్య కర్ణ మీదకు వస్తుంది. కర్ణ తండ్రి నాగినీడు పరపతితో బయటకు వచ్చి హత్య మిస్టరీని ఛేదించే పనిలో ఉంటాడు. అసలు అనును చంపింది ఎవరు ? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- రవితేజ నున్న
- నేహా జూరెల్
- నాగినీడు
- ప్రమోదిని
- యోగి ఖాత్రి
- జబర్దస్త్ బాబి
- జబర్దస్త్ అశోక్
- ఆ దూరి దుర్గ నాగ మోహన్
- పుష్ప దుర్గాజి
- యోగి ఖత్రి
- అజిజ్ భాయ్
- వీరేంద్ర
- గిద్ద మోహన్
- అప్పిరెడ్డి
- కంచిపల్లి అబ్బులు
- శ్రావణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తన్విక & మోక్షిక క్రియేషన్స్
- సమర్పణ: మణికొండ రంజిత్
- నిర్మాత: ముత్యాల రామదాసు, నున్నా కుమారి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య రాజ్
- సంగీతం: రోషన్ సాలుర్
- సినిమాటోగ్రఫీ: మురళీకృష్ణ వర్మన్
- ఎడిటర్ : కిషోర్ తిరుమల
- పాటలు: రెహమాన్
- సహ నిర్మాతలు: రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్.
మూలాలు
[మార్చు]- ↑ NT News (29 February 2024). "రాజుగారి అమ్మాయి ప్రేమాయణం". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.
- ↑ Sakshi (4 March 2024). "విలేజ్ లో మిస్టరీ". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.
- ↑ Zee News Telugu (14 March 2024). "'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే." Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.