రాజ్‌మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌మా
అన్నంతో వడ్డిచ్చిన రాజ్మా
ప్రత్యామ్నాయ పేర్లురాజ్‌మా, రాజ్మా , లాల్ లోబియా
మూల స్థానంభారత ఉపఖండం
ప్రాంతం లేదా రాష్ట్రంభారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్[1]
Associated national cuisineభారతీయ వంటకాలు
మూల పదార్థాలుకిడ్నీ బీన్స్
display: inline-block; line-height: 1.2em; padding: .1em 0; width: 100%;100 గ్రాముల ఉడికించిన రాజ్మా బీన్స్‌లో 140 కేలరీలు ఉంటాయి kcal
Cookbook:రాజ్‌మా  రాజ్‌మా

రాజ్‌మా (ఆంగ్లం: Rajma, హిందీ: राजमा, ఉర్దూ: راجما) అనేది రెడ్ కిడ్నీ బీన్స్‌కు భారతీయ పేరు.[2] ఇవి ముదురు ఎరుపు రంగులో ఉండి చూడడానికి కిడ్నీ ఆకారాన్ని పోలి ఉంటాయి. వీటిని రెడ్ బీన్ అని కూడా అంటారు.

రాజ్మా రిసిపి[మార్చు]

రాజ్మా అనేది ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో తయారు చేయబడిన ఉత్తర భారతీయ వంటకం. ఎంతో ప్రజాదరణ పొందినది. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహారంలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకపధార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి.[3]

వీటిని నానబెట్టి, ఆపై ఉల్లిపాయలు, టొమాటోలు, మసాలా దినుసులతో ఉడకబెట్టి రాజ్మా మసాలా అనే వంటకాన్ని తయారు చేస్తారు. దీనిని రాజ్మా లేదా లాల్ లోబియా అని కూడా పిలుస్తారు. ఇది చాలా మందపాటి గ్రేవీలో ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో కూడి ఉంటుంది. దీన్ని సాధారణంగా అన్నంతో, రోటీలతో వడ్డిస్తారు. ఇది భారత ఉపఖండం నుండి ఉద్భవించిన ఒక శాఖాహారం.  ఇది భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సాధారణ ఆహారంలో భాగం.[4] ఎర్రటి కిడ్నీ బీన్‌ను మెక్సికో నుండి భారత ఉపఖండానికి తీసుకువచ్చిన తర్వాత ఈ వంటకం అభివృద్ధి చేయబడింది.[5][6]

పోషక విలువలు[మార్చు]

100 గ్రాముల ఉడికించిన రాజ్మా బీన్స్‌లో దాదాపు 140 కేలరీలు, 5.7 గ్రాముల ప్రోటీన్, 5.9 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటాయి.[7]

విషపూరితం[మార్చు]

ఎర్రటి కిడ్నీ బీన్స్‌లో ఫైటోహెమాగ్గ్లుటినిన్ శాతం ఎక్కువ, అందువల్ల ముందుగా నానబెట్టి, కనీసం అరగంట పాటు ఉడికించకపోతే విషపూరితం. ఇది యు.ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి సిఫార్సు. దీంతో వాటిల్లోని టాక్సిన్‌ను పూర్తిగా నాశనం అవుతుంది. అయితే క్యాన్డ్ రెడ్ కిడ్నీ బీన్స్ నేరుగా తినవచ్చు. సరిగా ఉడకని ఉడకని రాజ్మా గింజలు తినడం వల్ల తీవ్రమైన వికారం, విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పులకు కారణమవుతాయి.

మూలాలు[మార్చు]

  1. Hallinan, Bridget (4 June 2021). "Use Leftover Rajma to Make These Kidney Bean Curry Burgers and Tacos" (in English). Food & Wine. Retrieved 2 July 2021. In this week's installment of Chefs at Home, Chitra Agrawal-co-founder of Brooklyn Delhi and cookbook author-starts off by showing how to make rajma, a North Indian and Pakistani kidney bean curry that she learned from her father.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Gogji Razma (Kidney Beans with Turnips)". Jagalbandi. Archived from the original on 2013-01-11. Retrieved 2009-07-07.
  3. Pitre, Urvashi (19 September 2017). Indian Instant Pot® Cookbook: Traditional Indian Dishes Made Easy and Fast. Rockridge Press. p. 64. ISBN 978-1939754547.
  4. "Preparation of Nepali Curry Rajma in Australia".
  5. "Rajma, rice and calories". The Hindu. Chennai, India. 22 September 2003. Archived from the original on 11 October 2003. Retrieved 2009-07-07.
  6. "Bhaderwah Rajmash: A variety unique in taste". Daily Excelsior. 7 July 2019. Retrieved 30 June 2020.
  7. "Rajma, rice and calories". The Hindu. Chennai, India. 22 September 2003. Archived from the original on 11 October 2003. Retrieved 2009-07-07.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్‌మా&oldid=3849900" నుండి వెలికితీశారు