రాజ్ భవన్, జమ్మూ
Appearance
రాజ్ భవన్ (ప్రభుత్వ భవనం) అనేది జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు అధికారిక శీతాకాల నివాసం. ఇది శీతాకాలపు రాజధాని నగరం జమ్మూ, జమ్మూ, కాశ్మీర్‌లో ఉంది.జమ్మూలోని రాజ్ భవన్ మహారాజాప్యాలెస్ భవనాలలోఒకటి, రణబీర్ మహల్, ఇది జమ్మూకాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వ అద్దె కింద ఉంది.
రాజ్ భవన్ తావి నదికి అభిముఖంగా ఉంది. ఇది 6.17 హెక్టార్లు (126 కెనాల్స్), 7 మార్లాస్ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అన్ని ప్రభుత్వ ఉత్సవ కార్యక్రమాలు జరిగే వేదిక ముందు విశాలమైన, అందమైన పచ్చిక బయలు ప్రదేశం ఉంది.
భారత రాష్ట్రపతి, భారత ప్రధాని, ఇతర ప్రముఖులు జమ్మూ పర్యటనలో ఉన్నప్పుడు రాజ్‌భవన్‌లో ఉంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతదేశ అధికారిక నివాసాల జాబితా
- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు