నైట్ రైటింగ్

వికీపీడియా నుండి
(రాత్రి రచన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Night Writing
Sonography
Typealphabet
LanguagesFrench
Time periodca. 1820
Child systemsBraille, New York Point
Unicode range(not supported)
Barbier's sonographie

చీకటిలో చదవడానికి చార్లెస్ బార్బియర్ సృష్టించిన లిపిని నైట్ రైటింగ్ అంటారు. ఒక కాగితపుఅట్టపై ఉన్న చదరపు గడులలో స్పర్శ ద్వారా గుర్తించే లిపి ఇది. నేడు ప్రపంచ వ్యాప్తంగా అంధులు వాడుచున్న బ్రెయిలీ లిపికి మూలం ఈ నైట్ రైటింగ్. ఈ నైట్ రైటింగ్‍లో ఒక అక్షరాన్ని గుర్తించడానికి 12 చుక్కలు అవసరమవుతాయి, ఈ 12 చుక్కలు ఒక చదరపు గడిలో ఒక నిలువ వరుసకి 6 చుక్కల చొప్పున రెండు నిలువ వరుసలలో ఉంటాయి. ఈ 12 చుక్కలలో ఉబ్బెత్తుగా ఉన్న చుక్కలను బట్టి అక్షరాన్ని గుర్తించగలుగుతారు. చార్లెస్ బార్బియర్ డీ లా సెర్రీ 19 వ శతాబ్దంలో ఫ్రెంచ్ సైన్యంలో ఒక కెప్టెన్. సైనికులు రాత్రులందు చీకటి ప్రదేశములో నిశ్శబ్దంగా ఒకరి నుంచి ఒకరు సమాచారం తెలుసుకోవడానికి నెపోలియన్ డిమాండ్‍కు ప్రతిస్పందనగా స్పర్శ ద్వారా గుర్తించగలిగే ఒక సంకేత భాషను చార్లెస్ బార్బియర్ కనుగొన్నారు. బార్బియర్ సిస్టానికి పొలిబియస్ స్క్వేర్ తో సంబంధముంటుంది, దీనిలో రెండంకెల కోడ్ ఒక అక్షరాన్ని సూచిస్తుంది. 6x6 చదరంలో ఫ్రెంచ్ వర్ణమాల యొక్క చాలా అక్షరాలు, అలాగే ద్వివర్గాలు, త్రివర్గాలు బార్బియర్ రూపాంతరంలో ఉన్నాయి.


 123456
1aiouéè
2aninonuneuou
3bdgjvz
4ptqchfs
5lmnrgnll
6oioinianienionieu

రెండు నిలువ వరుస చుక్కలకు ఒక అక్షరం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక చదరంలో ఉన్న మొదటి నిలువ వరుసలోని ఒకటి నుంచి ఆరు చుక్కలలో ఒకటి, రెండవ నిలువ వరుసలోని ఒకటి నుంచి ఆరు చుక్కలలో ఒకటి కలిసి ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 4-2 "t" ని సూచిస్తుంది.

 
 

ఒక చిహ్నాన్ని సూచించడానికి రెండు నిలువ వరుసలలోని 12 చుక్కలు (అంటే ఒక నిలువ వరుసలోని 6 చుక్కలు మరొక నిలువ వరుసలోని 6 చుక్కలు) అవసరమవుతాయి. మొదటి వరుసలోని 6 చుక్కలలో నాలుగు చుక్కలు ఉబ్బెత్తుగా ఉంటే దానిని మొదటి నిలువ వరుసలోని 4 గా, రెండవ నిలువ వరుసలోని 6 చుక్కలలో 2 చుక్కలు ఉబ్బెత్తుగా ఉంటే రెండవ నిలువ వరుసలో 2 గా గుర్తించాలి, అప్పుడు 4-2 "t" అనే అక్షరాన్ని సూచిస్తుంది.


ఇవి కూడా చూడండి

[మార్చు]

లూయిస్ బ్రెయిలీ

బయటి లింకులు

[మార్చు]