రాదుగ ప్రచురణాలయం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాదుగ పబ్లికేషన్స్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, భాషల్లో ప్రచురణలు చేసిన, రష్యాకు చెందిన ప్రచురణ సంస్థ. సోవియట్ యూనియన్ ప్రభుత్వం రాదుగ పబ్లికేషన్స్ ను చట్టం ద్వారా ఏర్పాటుచేసింది. ప్రభుత్వ నిధులతో సంస్థ తక్కువ ధరకు, విలువైన, నాణ్యమైన పుస్తకాలను ప్రచురణ చేసేది. సోవియట్ యూనియన్లోని వివిధ ప్రాంతాల భాషలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లోనూ ప్రచురణలు చేసింది. రాదుగ అంటే ఇంద్రధనుస్సు అని అర్థం.
రాదుగ పబ్లిషర్స్, సోవియట్ యూనియన్ యొక్క ప్రభుత్వ-యాజమాన్య ప్రచురణ సంస్థ, ఇది ఎక్కువగా పిల్లల సాహిత్యం వివిధ భాషలలో ప్రచురిస్తుంది. ఈ ప్రచురణ సంస్థ పుస్తకాలను సోవియట్ యూనియన్‍లో ముద్రించి పంపిణీచేసేది. ఈ పుస్తకాలు దేశ విదేశ భాషలలో ప్రచురించబడ్డాయి. రాదుగ అంటే రష్యన్ భాషలో ఇంద్రధనస్సు అని అర్దం.[1] వీరు అనేక శాస్త్రీయ పుస్తకాలు, కళలు, రాజకీయ పుస్తకాలు, క్లాసిక్ పుస్తకాలు, పిల్లల సాహిత్యం, నవలలు చిన్న ఫిక్షన్ వంటి అనేక పుస్తకాలను ప్రచురించారు. అందమైన హార్డ్ బౌండుతో, నాణ్యతతో, బొమ్మలతో ఈ పుస్తకాలు ఉండేవి భారతదేశంలో అతి తక్కువ ధరతో పుస్తకాలు లభించేవి. అక్కడ అచ్చయిన పుస్తకాలు పెద్దలను పిల్లలను విశేషంగా అలరించేవి[2]. ఇప్పటికీ ఈ పుస్తకాలకు చాలా మంది అభిమానులు వున్నారు.
చరిత్ర & ప్రచురణలు
[మార్చు]రాదుగ పబ్లిషింగ్ హౌస్ 1982 లో స్థాపించబడింది[3] అంతకు ముందు ఉన్న ప్రోగ్రెస్ (ప్రగతి) పబ్లిషింగ్ హౌస్ నుండి వేరు చేయబడింది దీని మూల సంస్థ అయిన ప్రోగ్రెస్ పబ్లిషర్స్ 1989 లో సంవత్సరానికి 50 భాషల్లో 750 శీర్షికలను ముద్రించారు ఇది గిన్నీస్ ప్రపంచ రికార్డు,[4] ముఖ్యంగా పిల్లల, సమకాలీన సాహిత్యంపై దృష్టి కేంద్రీకరించడం. పిల్లల సాహిత్యానికి ఒక ప్రామాణికతను నెలకొల్పటం, పిల్లల అనుభవాలను గుర్తించిన రచనలు చేయటం ఈ ప్రచురణాలయం ముఖ్య ఉద్దేశం[5] , అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం తన భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనుకునే ఉద్దేశంతో పుస్తకాలనే ప్రచార సాధనాలుగా ఎంచుకుంది.ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిమీద దృష్టి మాత్రమే కాకుండా వనరులు కూడా భారీగా వెచ్చించింది రష్యా. మంచి ముద్రణా నాణ్యత కలిగిన పుస్తకాలు అతి చౌకగా అందించేవాళ్లు[6]. ఇందులో భాగంగా ప్రగతి, రాదుగ, ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్ , మీర్ ప్రచురణాలయం వంటి సంస్థలు దీనికోసం వివిధ దేశాలకు, భాషలకు చెందిన అనేక మంది అనువాదకులకు ఉద్యోగాలు ఇచ్చి రష్యాకు రప్పించుకుని, అనువాదాలు చేయించింది. అలా తెలుగు ప్రాంతం నుండి కూడా పలువురు రచయితలు అక్కడ అనువాదకులుగా పని చేశారు అందులో వుప్పల లక్ష్మణరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వియార్, నిడమర్తి ఉమారాజేశ్వర రావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, నిడమర్తి మల్లికార్జున రావు వంటివారు ఉన్నారు, వీరి ద్వారా తెలుగులో రష్యన్ చరిత్ర కథలూ, గాథలూ, మన కాలం వీరుడు, బుల్లి మట్టి యిల్లు, ఆకుపచ్చ ద్వీపం, పసివాడి పగ, అడవిలో ఇళ్ళు, కళాతపస్వి యెగోరి, నొప్పి డాక్టరు, మక్సీమ్ గోర్కీ సాహిత్య వ్యాసాలు , మక్సీమ్ గోర్కీ అమ్మ , అపరాధ పరిశోధకుడి నోట్సు,ఎన్.రాద్లోవ్ బొమ్మల కథలు , సమరంలో కలిసిన గీతలు ,విషాధ సంగీతం కథా సంకలనం వంటి తెలుగు పుస్తకాలు ప్రజాదరణ పోందాయి. ఈ ప్రచురణాలయం ద్వారా వి.బియాంకి, వి.దచ్ కేవిచ్, జి.యూదిన్, ఎల్. షేయినిన్ ,వి.పనోవ, ఎ.కుప్రీన్, వి.బగమొలొవ్, ఎమ్. లేర్మొంతొవ్, ఎ.బెల్యాయెవ్, ఎస్ అలెక్సేయ్ ,టాల్ స్టాయ్ మొదలైన రష్యన్ రచయితల పుస్తకాల తెలుగు అనువాదాలు ప్రచురించపడ్డాయి[7]. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక దాని ఫలితంగా ప్రగతి పబ్లిషర్స్ తన కార్యకలాపాలను మూసివేసింది ప్రచురణ, పంపిణీ అనివార్యంగా ముగింపుకు వచ్చాయి అ పరిమాణాల అనంతరం మూడు సంవత్సరాల తరువాత 1993 లో రాదుగ ప్రచురణాలయం మూతబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "బాలలను అలరించే జానపద కథలు - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-10-05.
- ↑ "చిన్నప్పటి రష్యన్ కథలు | పుస్తకం". pustakam.net. Retrieved 2020-10-04.
- ↑ "Издательство «Радуга» — Картинки и разговоры" (in రష్యన్). Retrieved 2020-10-04.
- ↑ "Most prolific publisher". Guinness World Records (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
- ↑ "From Moscow to Vijayawada: How generations of Telugu readers grew up on Soviet children's literature - Art-and-culture News , Firstpost". Firstpost. 2020-09-14. Retrieved 2020-10-04.
- ↑ "ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?". BBC News తెలుగు. Retrieved 2020-10-04.
- ↑ Battula, Anil (2018-07-20). "'రాదుగ' మళ్ళీ రాదుగా! by పెండెం జగదీశ్వర్". సోవియట్ తెలుగు పుస్తకాలు. Retrieved 2020-10-04.