రాధా రమాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా రమాదేవి

రాధా రమాదేవి బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి చిన్న పిల్లల వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఎం.బి.బి.యస్ లోణే రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) లో జెనెటిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అదే సంస్థలో వైద్యాధికారిగా 1977 ముంచి 1994 వరకు పనిచేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

దేశంలో మొట్టమొదటిసారిగా నియోనాటల్ స్క్రీనింగ్ ను ప్రారంభించిన ఘనత ఈమెదే. అంటే నవజాత శిశువు పాదం నుండి రెండు చుక్కల రక్తం తీసుకొని పరీక్షలు చేయడాం ద్వారా భవిష్యత్తులో ఆ బిడ్డ ఎదుర్కొనే శారీరక, మానసిక, ఎదుగుదల లోపాలను ముందే కనిపెట్టవచ్చు. అవి తలెత్తకుండా ముందు జాగ్రత్త కూడా తీసుకోవచ్చు. దేశ విదేశాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో మానవాళికి మేలు చేసే అంశాలపై ఎన్నో పత్రాలు అందజేశారీమె. నియోనాటల్ స్క్రీనింగ్ పై జపాన్ లో జరిగిన ఒక సదస్సులో ఈమె ప్రసంగించారు మనీలా లో 2001 లో జరిగిన నాలుగో ఆసియా పసిఫిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ డ్.ఎన్.ఎ అండ్ ఫింగర్ ప్రింట్స్ డయోగ్నాస్టిక్స్ లో డయాగ్నోస్టిక్స్ సైన్సెస్ సైన్సెస్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

శిశువుల్లో లోపాలు

[మార్చు]

పురిటి బిడ్డను పరీక్షించి ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అనే అంశం పై డాక్టర్ రమాదేవి గారు చేస్తున్న పరిశోధనలు పూర్తయ్యాయి. 2004 సంవత్సరం వరకు ఈమె హైదరాబాద్ నగరంలో 20 వేల మంది నవజాత శిశువులపై పరిశోధనలు చేసి, భవిష్యత్తులో వారు ఎదుర్కోనున్న పది ప్రధాన సమస్యలను కనుగొన్నారు. భవిష్యత్ లో దేశవ్యాప్తంగా ఐదు కేంద్రాలు స్థాపించి, చిన్నారులు ఎదుర్కోనున్న యాభై లోపాలను గుర్తించేదుకు పరిశోధనలు చేయాలన్నదే ఈమె ధ్యేయం.

అవార్డులు

[మార్చు]

ఈమె సేవలను గుర్తించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ 2006 లో "జాతీయ బయోటెక్ అవార్డు" ను సీనియర్ మహిళా శాస్త్రవేత్తల విభాగంలో ఢిల్లీలో అందుకున్నారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]