Jump to content

రాధ జయలక్ష్మి

వికీపీడియా నుండి
రాధ జయలక్ష్మి

రాధ (జననం 1932) [1] జయలక్ష్మి (1932 - 2014) [2] లు ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరిద్దరూ రాధ జయలక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. జంట గాయినులైన వీరు, 1940, 1950లలో సినీ నేపథ్య గాయినులుగా ప్రఖ్యాతులయ్యారు. ఆ తరువాత సంగీత గురువులుగా కూడా చేశారు. నిజానికి జయలక్ష్మి సినిమాల్లో నేపథ్యగాయని గా పాడినా, ఇద్దరినీ కలిపి రాధ జయలక్ష్మిగా వ్యవహరించేవారు. రాధ, జయలక్ష్మి కజిన్‌లు. కచేరీలు ఇచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి పాడేవారు. వీరు ప్రసిద్ధ గాత్ర విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియం వద్ద శిష్యరికం చేసారు.[3]

1981 లో ఈ జంటకు గాత్ర విభాగంలో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. [4] వీరిలో జయలక్ష్మి 2014 మే 27 న మరణించింది.[5]

వీరిద్దరూ కలిసి అనేక బహిరంగ ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ సినిమాల్లో మాత్రం జయలక్ష్మి మాత్రమే పాడింది. అయితే పేరు మాత్రం రాధ జయలక్ష్మి అనే వేసేవారు. రాధ జయలక్ష్మి గురువులుగా మారి అనేకమందికి సంగీత బోధించారు. ప్రియ సిస్టర్స్ గా పేరొందిన షణ్ముఖప్రియ, హరిప్రియలు వీరివద్దనే శిష్యరికం చేసారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-22. Retrieved 2020-07-03.
  2. https://www.thehindu.com/news/cities/chennai/carnatic-singer-dead-in-chennai/article6054441.ece
  3. "GNB, the good friend". The Hindu. 23 May 2003. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 3 జూలై 2020.
  4. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 ఫిబ్రవరి 2012. Retrieved 3 జూలై 2020.
  5. "Vidushi Jayalakshmi is no more". Archived from the original on 2016-03-04. Retrieved 2020-07-03.
  6. "We owe it to Radha-Jayalakshmi". The Hindu. 4 April 2008. Archived from the original on 9 ఏప్రిల్ 2008. Retrieved 18 May 2010.