రామతీర్థం (విడవలూరు)
రామతీర్థం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, రామతీర్థం | |
అక్షాంశరేఖాంశాలు: 14°38′42″N 80°08′39″E / 14.645080°N 80.144035°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | విడవలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
రామతీర్థం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయితీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చిమటా వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికైనాడు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
[మార్చు]శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, రామతీర్థం గ్రామంలో సముద్రతీరాన ఉంది. సముద్రతీరాన, సూర్యోదయ సమయంలో, శ్రీరామచంద్రుడు, సైకతం (ఇసుక)తో శివలింగాన్ని చేసి, శివార్చన చేసిన పవిత్రస్థలి ఇది. ఆంధ్రరాష్ట్ర రామేశ్వరంగా విలసిల్లితున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో, భక్తులు సముద్రస్నానం ఆచరించి, స్వామివారికి మొక్కుకుంటే, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాడవిశ్వాసం. యుగాలు మారినా తరగని భక్తితో, భక్తులు ఈ స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. రాముడు సేవించిన తీర్థం కనుక, "రామతీర్థం"గా పేరు గాంచింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీనకాలం నుండి దివ్యక్షేత్రంగా వెలుగొందుచూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. స్థల పురాణం:- శ్రీరాముడు సీతాన్వేషణకు వెళుతున్న సమయంలో, ఒకరోజు ఉదయం, ఈ ప్రాంతానికి వచ్చి, సూర్యోదయసమయంలో శివుణి ప్రతిష్ఠించి అర్చన చేసాడు. రాములవారి పాదస్పర్శ ఏర్పడిన భూమిగాబట్టి, ఈ క్షేత్రం, "రామతీర్థం" గానూ, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక, శివుడు, "శ్రీ రామలింగేశ్వరస్వామి" గానూ పూజలందుకొనుచున్నాడు. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు స్వామివారికి దేవాలయం నిర్మించినారని ఇక్కడ చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో స్వామివారిచే స్వప్నంలో ప్రేరణ పొందిన శ్రీ కోటంరెడ్డి శేషాద్రిరెడ్డి, ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసారు. ఆలయం శిథిలావస్థకు చేరటంతో, 2009 లో శ్రీ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతుల భూరి విరాళంతో ఆలయాన్ని మరలా పునర్నిర్మించారు. వర్షాల సమయంలో, సముద్రం పొంగి ఊరంతా జలమయం అయి, సముద్రం ముందుకు వచ్చినప్పుడు, స్వామివారు కట్టను తెంచి, గ్రామాన్ని రక్షించారని స్థానిక భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలు:- ప్రతి సంవత్సరం అత్యంతవైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు, 2014, జూన్-18, బుధవారం నుండి ప్రారంభించారు. 18వ తేదీన అంకురార్పణ, 19వ తేదీన ధ్వజారోహణం, రాత్రికి శేషవాహనం, 20వ తేదీన చిలుక వాహనం, 21వ తేదీన హంసవాహనం, 22వ తేదీన పులి వాహనం, 23వ తేదీన రావణసేవ, 24వ తేదీన నందిసేవ, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన కళ్యాణం, 27వ తేదీన తీర్ధవాది, 28వ తేదీన ధ్వజవరోహణం కార్యక్రమాలు నిర్వహించారు.