రామరాజీయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామరాజీయము
అను
నరపతి విజయము
కృతికర్త: అందుగుల వెంకయ్య
సంపాదకులు: Gustav Oppert
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1923
పేజీలు: 65


రామరాజీయము లేదా నరపతి విజయము ఒక తెలుగు కావ్యము.[1] దీనిని అందుగుల వెంకయ్య రచించారు. ఈనరపతివిజయము కవిత్వముకంటే చరిత్రమును చెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనది. ఇది ఏకాశ్వాసము. దీనికి Gustav Oppert సంపాదకునిగా వ్యవహరించి, ఆంగ్లంలో విపులమైన ముందుమాటను రచించారు. ఈ కావ్యం 1923 లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు తొలిసారిగా ముద్రించారు.

కథాంశం[మార్చు]

వెంకయ్య కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమడగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయమను ఈగ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును.[2]

కావ్యములోని కవిత్వ రీతిని దెలుపు పద్యములు[మార్చు]

ఈనరపతివిజయము నందు కవిత్వముకూడ రసవంతముగా నున్నది. కవిత్వరీతిని దెలుపుటకై రామరాజీయములోని రెండు పద్యములను ఉదాహరించబడినవి.

ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
బమ్మిన జూతపోతనవపల్లవబింబఫలారుణాంబుజా
తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.

చ. అతివిభవంబునన్ దితిసుతాహితరాజు మహాపరాక్రమో
న్నతి మృగరాజు సోయగమున న్నలరాజు సమస్తధర్మప
ద్ధతి నలధర్మరాజు పటుధైర్యమునన్ గిరిరాజు వాక్ప్రశ
స్తత ఫణిరాజు నిర్దళితశాత్రవరా జగుబుక్క రాజిలన్.

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. అందుగుల వెంకయ్య (1923). రామరాజీయము అను నరపతి విజయము (PDF). మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. Retrieved 18 August 2020.
  2. కందుకూరి వీరేశలింగం పంతులు (1949). ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము. రాజమండ్రి: హితకారిణీ సమాజము. p. 258. Retrieved 18 August 2020.