రామాపురం (వరికుంటపాడు)

వికీపీడియా నుండి
(రామాపురం(వరికుంటపాడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రామాపురం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వరికుంటపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. రామాపురం పంచాయితీలో సందిరెడ్ది వారి పల్లె,కాకొలు వారి పల్లె,తురక పల్లె, BC కాలనీ,SC కాలనీ ఉన్నాయి. ఇక్కడ మెట్ట పంటగా బత్తాయి,మామిడి తోటలు,సాగు పంటగా వరి,జొన్న పంటలు, వాణిజ్య పంటగా పొగాకు,కంది పంటలు పండిస్తారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

1964 లో ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకూ, ఏడుసార్లు ఎన్నికలు జరుగగా, ఆరు సార్లు ఏకగ్రీవమే. ఈ పంచాయతీకి చెందిన నాయకులే జిల్లా పరిషత్తు, వ్యవసాయ మార్కెట్టు కమిటీ, సింగిల్ విండో పదవులనలంకరించారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికలలో, సొసైటీగిరిని దక్కించుకున్న శ్రీ పావులూరి రవీంద్రబాబు కూడా, ఈ పంచాయతీకి చెందినవారే. ఈ పంచాయతీలో అంగనవాడీ కేంద్రాలు, సిమెంటు రహదారులు నిర్మించారు. దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి, వీధి దీపాలు, రామాలయాలు, ఆంకాళ పరమేశ్వరీ, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం నిర్మించారు. ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా ఉత్సవాలు నిర్వహించెదరు.

ఈ గ్రామ సర్పంచులు[మార్చు]

  1. డి. నరసింహం - - - -1964 - ఏకగ్రీవం.
  2. మేడసాని చెన్నకేశవులు- -1970 - ఏకగ్రీవం.
  3. రాయవరపు నాగయ్య - -1981 - ఏకగ్రీవం.
  4. దారపునేని కొండమ్మ
  5. ఆవుల తిరిపాలు - - - -1988 - ఏకగ్రీవం
  6. కర్నాటి రోశయ్య - - - -1996 - ఏకగ్రీవం
  7. మేడసాని చెన్నకేశవులు - -2001 ఎన్నికలు
  8. చీర్లదిన్నె విజయలక్ష్మి -2006 - ఏకగ్రీవం

మూలాలు[మార్చు]