రామ్ మాధవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ram Madhav
జననం (1964-08-22) 1964 ఆగస్టు 22 (వయసు 59)
జాతీయతIndian
విద్యాసంస్థUniversity of Mysore
వృత్తిPolitician
రాజకీయ పార్టీBharatiya Janata Party

రామ్‌మాధవ్ (జ.1964 ఆగస్టు 22) భారతదేశ రాజకీయనాయకుడు, రచయిత, జర్నలిస్టు. అతడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి.[1][2] రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్ పనిచేసిన ఇతను 2014లో బీజేపీలో చేరాడు. అనేక పుస్తకాలను రచించాడు. అతడు రాసిన ప్రస్తుత పుస్తకం "అన్‌ఈజీ

నైబర్స్"( 50 యేండ్ల యుద్ధం తరువాత భారత, చైనా) .[3][4][5]

జీవిత విశేషాలు[మార్చు]

ఆర్‌ఎస్‌ఎస్ లో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతను సంఘ్ నాయకత్వ సూచనల మేరకే బీజేపీలో చేరడం జరిగింది. వారణాశి రామ్‌ మాధవ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందినవారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేసిన ఇతను మైసూరు యూనివర్శిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో పీజీ చేశాడు.[6]

రాజకీయ జీవితం[మార్చు]

మాథవ్ కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో సంబంధాలుండేవి. అతడు 1981లో ఆర్.ఎస్.ఎస్ లో పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా చేరాడు. ఆ సంస్థలో అతడు అనేక కీలక స్థానాలలో కొనసాగాడు.[7] ఆర్‌ఎస్‌ఎస్‌లో సమర్థవంతమైన అధికార ప్రతినిధిగా చాలాకాలం పనిచేశారు. ఇతను హైదరాబాద్‌లో "ప్రజ్ఞాభారతి" అనే ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. అనేక జాతీయ పత్రికల్లో ఇతను కాలమ్స్ రాశాడు.[6] తెలుగు వారపత్రిక జాగృతి కి సహ సంపాదకునిగా పనిచేసాడు.[8] ఆర్.ఎస్.ఎస్ నిర్వహిస్తున్న పబ్లికేషన్స్ తో 20 సంవత్సరాలపాటు జర్నలిస్టుగా ఉన్నాడు. సుమారు 12 పుస్తకాలను రాసాడు.[9]

అతను 2003-2014 నుండి RSS యొక్క జాతీయ ప్రతినిధిగా పనిచేశాడు. మాధవ్ బిజెపికి రెండో స్థానంలో నిలిచాడు, 2014 లో దాని జాతీయ కార్యదర్శిగా నియమించబడ్డాడు.[7]

రాజకీయ స్థానాలు[మార్చు]

విదేశాంగ విధానం[మార్చు]

ఈ ప్రాంతంలో చైనా యొక్క "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్" ను తనిఖీచేయడానికి "క్రియాశీలక పాత్ర" తీసుకోవడానికి ఆయన పిలిపించబడ్డాడు.[10]

మూలాలు[మార్చు]

  1. Administrator. "National Office Bearers". bjp.org. Archived from the original on 2014-10-22. Retrieved 2018-04-24.
  2. "Amit Shah: Congress will have to give ads to find candidates". IndiaToday.in. Retrieved 2014-08-16.
  3. "Ram Madhav on Twitter". Twitter.
  4. "Ram Madhav's new book "Uneasy Neighbours: India and China after Fifty Years of the War"". samvada.org. Archived from the original on 2017-11-16. Retrieved 2018-04-24.
  5. "About". rammadhav.in. Archived from the original on 2017-04-07. Retrieved 2018-04-24.
  6. 6.0 6.1 "The Pracharak Is Going Places". outlookindia.com. 8 December 2014. Retrieved 2 February 2016.
  7. 7.0 7.1 "RSS leader Ram Madhav to join BJP". The Times of India.
  8. "Ram Madhav is emerging as BJP's firefighter". SundayGuardianLive. 26 September 2016. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 2 February 2016.
  9. "President for RSS think-tank meet". The Telegraph. Retrieved 2 February 2016.
  10. "India needs to focus eastward: Ram Madhav". The Hindu. January 17, 2018. The BJP leader also called for support for India's "proactive role in the region", saying New Delhi would not be a "spectator" as China pushed its Belt and Road initiative forward. He called the project a "Neo-Marshall plan" in a veiled reference to the carving up of post-war Europe as akin to Chinese infrastructure projects in Asia and Africa.

ఇతర పఠనాలు[మార్చు]