రాయన భాగ్యలక్ష్మి
రాయన భాగ్యలక్ష్మి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 11 మార్చి 2021 | |||
ముందు | కోనేరు శ్రీధర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 198 | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి |
|
రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె ప్రస్తుతం విజయవాడ మేయర్‌గా విధులు నిర్వహిస్తుంది.[1]భాగ్యలక్ష్మి 1981లో జన్మించి, ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేసింది. ఆమె తండ్రి బెవర నారాయణరావు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. మొత్తం అయిదుగురు సంతానంలో ఈమె రెండోఆమె. తండ్రి నారాయణరావు ఉద్యోగ బదిలీలో భాగంగా కుటంబంతో సహా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో కొంతకాలం ఉండి తిరిగి విజయవాడ కొండ ప్రాంతానికి వచ్చి స్థిర పడ్డారు.
భాగ్యలక్ష్మికి విజయవాడలో స్థిరపడిన రాయన విశ్వనాథం తనయుడు నరేంద్రకుమార్‌తో వివాహం జరిగింది. ఆమె భర్త కుటుంబం రాజకీయం, వ్యాపారం. కాంట్రాక్టు పనులు చేసేవారు. ఒకటో పట్టణం ప్రాంతంలో నరేంద్రకుమార్ కేబుల్ టివి కలెక్షన్ల వ్యాపారం చేసేవాడు. పెళ్ళైన తరువాత ఆమె ఆ వ్యాపారంలో భాగస్వామిగా కేబుల్ కనెక్షన్లు ఇవ్వడం, రుసుములు వసూలు, తదితర అంశాలను పర్యవేక్షించేది. రాయన నరేంద్రకుమార్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]రాయన భాగ్యలక్ష్మి 2014లో కాంగ్రెస్ పార్టీలో ద్వారా రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటో పట్టణం 46వ డివిజన్ నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఆమె అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2021లో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 46వ డివిజన్ నుండి పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. రాయన భాగ్యలక్ష్మి 2021 మార్చి 18న విజయవాడ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై[2][3], 2021 మార్చి 29న మేయర్‌గా భాద్యతలు చేపట్టింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Meet Rayana Bhagya Lakshmi, the fifth woman mayor of Vijayawada Municipal Corporation". The New Indian Express. Retrieved 2021-05-12.
- ↑ ETV Bharat News (18 March 2021). "విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
- ↑ Andhra Jyothy (18 March 2021). "విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
- ↑ Andhra Jyothy (29 March 2021). "మేయర్ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.