రాయల్ ఎన్‌ఫీల్డ్

వికీపీడియా నుండి
(రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతూ సంచలనం సృష్టిస్తోంది.

విశేషాలు

[మార్చు]

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 1893లో ఇంగ్లాండ్‌లో ఎన్‌ఫీల్డ్‌ సైకిల్‌ కంపెనీ పేరుతో మొదలైంది. తరవాత రైఫిళ్ల తయారీకీ పేరొందిన ఈ కంపెనీ, 1901లో మొదటి బైక్‌ను తయారుచేసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణదళాలకోసం తేలికపాటి మోటారుసైకిళ్లను కేవలం 60 కిలోల బరువూ, 125 సిసి టూ స్ట్రోక్‌ ఇంజిన్‌తో ‘ఫ్లయింగ్‌ ఫ్లీ’ పేరుతో తయారుచేసి, పారాచూట్‌ల ద్వారా సైనికులకి అందించేదట. ఆ తరవాత ఇది చెన్నైకి చెందిన మద్రాసు మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ‘ఎన్‌ఫీల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ‘మేడ్‌ లైక్‌ గన్‌, గోస్‌ లైక్‌ బుల్లెట్‌...’ అనే స్లోగన్‌తో మోటారుసైకిళ్లను తయారుచేసింది. 1965లో భారత ప్రభుత్వం సరిహద్దుల్లో పెట్రోలింగ్‌కోసం దాదాపు 800 పైగా 350 సి.సి. బుల్లెట్‌ బైక్‌లను కొనుగోలు చేయడంతో బుల్లెట్టు భారతీయ ఆర్మీ, పోలీసు దళాల అనధికారిక మోటారుసైకిల్‌గానూ; జాతీయ పర్వదినాల్లో రక్షణదళాలు ఈ బైకులమీద విన్యాసాలు ప్రదర్శించడంతో భారత జాతీయ బైక్‌గానూ ప్రాచుర్యం పొందింది. 1994లో ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ పూర్తిగా మనదేశానికి చెందిన ఐషర్‌ కంపెనీ హస్తగతమై, ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ బ్రాండ్‌తో ‘బిల్ట్‌ లైక్‌ ఎ గన్‌’ నినాదంతో మోటారుసైకిళ్లను రూపొందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. మోటారుసైకిళ్ల తయారీలోనే అత్యంత ప్రాచీనమైన ఈ కంపెనీ, ప్రస్తుతం మనదేశం నుంచి సుమారు 45 దేశాలకు బైక్‌లను ఎగుమతి చేస్తుండటం విశేషం.[1]

కంపెనీ మోడల్

[మార్చు]
MODEL ENGINE RATE
రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 యుసిఇ ఇంజిన్‌: 346 సిసి, వేగం: గంటకి 100 కి.మీ. ధర: రూ.1,12,500(ఎక్స్‌ షోరూమ్‌ ధర)
ఎలక్ట్రా 346 సిసి, వేగం: గంటకి 120 కి.మీ రూ.1,26,500
క్లాసిక్‌ 350 346 సిసి, వేగం: గంటకి 130 కి.మీ. రూ.1,35,000
థండర్‌బర్డ్‌ 350 346 సిసి, వేగం: గంటకి 130 కి.మీ రూ. 1,45,000
బుల్లెట్‌ 500: 499 సిసి., వేగం: గంటకి 135 కి.మీ., రూ. 1,65,000
క్లాసిక్‌ 500: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., రూ. 1,75,000
క్లాసిక్‌ 500 డెజర్ట్‌ స్టార్మ్‌ 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., రూ. 1,78,000
క్లాసిక్‌ 500 క్రోమ్‌: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., రూ. 1,85,000
థండర్‌బర్డ్‌ 500 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., రూ. 1,87,000
కాంటినెంటల్‌ జిటి 535 535 సిసి సింగిల్‌ సిలిండర్‌, వేగం: గంటకి 145 కి.మీ., రూ. 2,08,000

మూలాలు

[మార్చు]
  1. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. "బుల్లెట్‌... దూసుకుపోతోంది." www.eenadu.net. ఈనాడు. Archived from the original on 3 సెప్టెంబరు 2017. Retrieved 3 September 2017.