రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు.
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
కెప్టెన్ | ఫ్యాప్ డు ప్లెసిస్ |
కోచ్ | సంజయ్ బంగర్ |
యజమాని | యునైటెడ్ స్పిరిట్స్ |
జట్టు సమాచారం | |
నగరం | బెంగళూరు, కర్ణాటక |
రంగులు | ఎరుపు |
స్థాపితం | 2008 |
స్వంత మైదానం | చిన్న స్వామి స్టేడియం |
చరిత్ర | |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు | 0 |
ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.[1][2]
ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.
ఇక ఈ చెట్టుకు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ ఎన్నో గొప్ప విజయాలను అందించారు.
చరిత్ర
[మార్చు]సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[3] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో బెంగళూరు కూడా ఒకటి. ఈ జట్ల కోసం ఫిబ్రవరి 20, 2008 న వేలం నిర్వహించగా బెంగళూరు జట్టునువిజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది రెండో అతిపెద్ద మొత్తం కాగా మొదటిది ముంబై జట్టు కోసం రిలయన్స్ చెల్లించింది.
మూలాలు
[మార్చు]- ↑ Veerappa, Manuja (24 August 2019). "Sanjay Bangar may be named RCB batting coach". The Times of India. Retrieved 22 November 2019.
- ↑ Ananthanarayanan, N (28 May 2018). "IPL 2018: Royal Challengers Bangalore aim to shed underachievers tag". Hindustan Times. Retrieved 22 November 2019.
- ↑ "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.