రాయసం శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయసం శేషగిరిరావు

పదవీ కాలం
1952-1957
తరువాత పెండేకంటి వెంకటసుబ్బయ్య
నియోజకవర్గం నంద్యాల

వ్యక్తిగత వివరాలు

జననం 13 జూలై 1909
మరణం 30 మే 1963
జీవిత భాగస్వామి కమలమ్మ[1]

రాయసం శేషగిరిరావు, (జ. 13 జూలై 1909 - 30 మే 1963), 1వ లోక్‌సభ సభ్యుడు. 1952 సార్వత్రిక ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచాడు.[2]

శేషగిరిరావు 1909, జూలై 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో జన్మించాడు. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1925లో కమలమ్మను వివాహం చేసుకున్నాడు.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన శేషగిరిరావు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. లాండ్ మార్ట్‌గేజ్ బ్యాంకు సలహాదారుగా, రాయలసీమ మహాసభకు కార్యదర్శిగా కూడా పనిచేశాడు.

శేషగిరిరావు కవి కూడా. సాహిత్య పరిషత్తు నుండి కవిశేఖర బిరుదును కూడా పొందాడు. ఈయన రచనల్లో నాదేశ్వరి, మహర్షి మహానందయ్య, పాణికేశ్వర మహాత్మ్యము , కళ్యాణ మంజరి, కొత్త నమూనా (1933) అనే నాటిక కూడా ఉన్నాయి.[3] ఈయన జ్యోతిష్యంపై కూడా ఒక పుస్తకం వ్రాశాడు.[మూలాలు తెలుపవలెను]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-07. Retrieved 2017-11-12.
  2. "Members Bioprofile from Indian Parliament". Archived from the original on 2017-11-07. Retrieved 2017-11-12.
  3. Rayasam, Seshagiri Rao (1933). Krotta Namoona (in Telugu). Nandyala: Nandyala Amateurs. Retrieved 1 November 2017.CS1 maint: unrecognized language (link)