రాయుడు (2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయుడు
దర్శకత్వంఎం. ముత్తయ్య
రచనఎం. ముత్తయ్య
నిర్మాతజి.హరి
తారాగణంవిశాల్
శ్రీదివ్య
ఛాయాగ్రహణంవెల్ రాజ్
శ్రీనివాస్ దేవంశం
కూర్పుప్రవీణ్ కె.ఎల్.
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
హరి వెంకటేశ్వర పిక్చర్స్
విడుదల తేదీ
2016 మే 20 (2016-05-20)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹15 కోట్లు

రాయుడు 2016లో విడుదలైన తెలుగు సినిమా. హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌ పై జి.హరి నిర్మించిన ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహించాడు.[1] విశాల్, శ్రీదివ్య, సూరి, రాధారవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో 'మరిదు' పేరుతో , తెలుగులో ‘రాయుడు’ పేరుతో 20 మే 2016న విడుదలైంది.

కథ[మార్చు]

అనంతపురంలో ఓ గ్రామంలో రాయుడు (విశాల్) మార్కెట్ లో మూటలు మోసే కూలీ. తన చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో అన్నమ్మ(అమ్మమ్మ) దగ్గర పెరుగుతాడు. ఆమె కోరిక మేరకే భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) తో పెళ్ళి చేయాలని అనుకుంటుంది. ఐతే భాగ్యలక్ష్మి తన తల్లి భానును చంపిన రౌడీ రోలెక్స్ బాచీ (ఆర్కే సురేష్)కి వ్యతిరేకంగా కోర్టులో రిట్ పిటిషన్ వేసి పోరాడుతూ ఉంటుంది. దీంతో అతడి మనుషులు ఆమెను చంపాలని చూస్తుంటారు. విశాల్ ఆ రౌడీల నుంచి ఆమెను కాపాడతాడు. అప్పుడే తన నాయనమ్మ ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరడానికి కారణమేంటో రాయుడికి తెలుస్తుంది. ఇంతకీ ఆ కారణమేంటి ? రాయుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడా ? లేదా ?? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హరి వెంకటేశ్వర పిక్చర్స్
  • నిర్మాత: జి.హరి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్తయ్య
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • సినిమాటోగ్రఫీ: వెల్ రాజ్
  • ఎడిటర్ : ప్రవీణ్ కె.ఎల్.

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 April 2016). "మాస్.. మాస్‌గా..!". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  2. The Hindu (27 May 2016). "Rayudu: A long, tedious watch" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.