Jump to content

రావి రంగారావు

వికీపీడియా నుండి
రావి రంగారావు
జననంరావి రంగారావు
1952 జులై 10
అనంతవరప్పాడు, గుంటూరు జిల్లా
ఇతర పేర్లుడాక్టర్ రావి రంగారావు
వృత్తివిశ్రాంత ప్రిన్సిపాల్
తండ్రిరావి వీరయ్య
తల్లిఅచ్చమ్మ

డాక్టర్ రావి రంగారావు మినీ సాహిత్య ప్రక్రియ అనే రంగంలో కొత్త తరహాలో విస్తృతంగా ప్రయోగాలు చేసిన కవి.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రావి రంగారావు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులో రావి వీరయ్య-అచ్చమ్మ దంపతులకు 1952 జులై 10న జన్మించారు. అనంతవరప్పాడు ప్రభుత్వ పాఠశాల, పాత గుంటూరు యాదవ ఉన్నత పాఠశాల, హిందూ కళాశాల (గుంటూరు), గుంటూరు ఆంధ్ర లూథరన్ కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలలో చదువుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., "పిల్లలో కవితా రచనా నైపుణ్యాలు" అనే అంశం గురించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పరిశోధన డిగ్రీలు తీసుకున్నారు.

సాహితీ సేవ

[మార్చు]

1970 లో తొలి కవిత అచ్చయింది. అయిదు దశాబ్దాలుగా సాహిత్య భాషా సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి కొనసాగిస్తున్నారు.[1] దాదాపు 40 పుస్తకాలు ముద్రించారు. మచిలీపట్నం, ఏ.జె. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీ.ఈడీ. కళాశాలలో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ అనంతరం గుంటూరు లో స్థిరపడి "అమరావతి సాహితీ మిత్రులు" సంస్థ స్థాపించి సాహిత్య కార్యక్రమాల నిర్వహణ, "రావి రంగారావు సాహిత్య పీఠం" నెలకొల్పి ప్రతీఏటా ఉత్తమ కవిత్వ గ్రంథాలకు "జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు" [2]అందించటం. ప్రతి నెలా మూడో ఆదివారం అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో 'ఈ మాసపు కవి', అనేక మంది కవులచే కవిత్వ పఠనం మొదలైన కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.

చిన్న పిల్లలతో, స్కూలు విద్యార్థులతో కాలేజీ యువకులతో కవిత్వం రాయించటం ప్రవృత్తి."మచిలీపట్టణం సాహితీమిత్రులు" అనే సాహితీ సంస్థను స్థాపించి దాదాపు 30 ఏళ్ళు విజయవంతంగా నడిపించారు. అనేక కార్యక్రమాలను నిర్వహించి అగ్రశ్రేణి సాహితీవేత్తలను సమావేశాలకు రప్పించి వందలాదిమంది కవులను సత్కరించారు. ఆయన ఆధ్వర్యంలో అనేక సాహితీ గోష్టులను నిర్వహించారు.

పద్య కవితా సంపుటాలు

[మార్చు]
  • అమృత వృక్షం
  • అశ్వత్థ వృక్షం
  • రావి శతకం
  • వేంకటేశ శతకం
  • మినీ కవితల సంపుటాలు
  • గుడ్ మార్నింగ్,
  • అగ్గి పెట్టె,
  • గుండె దీపాలు,
  • ఎన్నికల చెణుకులు,
  • వెలుతురు వేళ్ళు,
  • సబ్బు బిళ్ళ,
  • దారి దీపాలు
  • కిరణాలు: రావి కిరణాలు, ప్రభారవి
  • హైకూలు: "సామాజిక హైకూలు"

వచన కవితా సంపుటాలు

[మార్చు]
  • ముఖం పుల్ల
  • రేజరులో సూర్యుడు
  • సూర్యుళ్ళ గెలుపు
  • తెల్ల చీకటి
  • కలలో కవిత
  • కుంకుడు కాయ
  • సూర్య రసం
  • సూర్యుడిని నెత్తి కెత్తుకొని
  • గుండెలో నదులు నింపుకొని
  • కొత్త క్యాలెండర్
  • కొత్త సూర్యుళ్లు మొలిచితీరాలి[3]

బాల సాహిత్య గ్రంథాలు

[మార్చు]
  • రావి పొడుపు కథలు
  • రావి బాల గేయాలు
  • రావి చిట్టి గేయాలు
  • రావి బాల కథలు

విమర్శనా గ్రంధాలు

[మార్చు]
  • మినీ కవిత శిల్పసమీక్ష
  • కవితాలోచనం
  • కవితాంతరంగం
  • పరిశోధన గ్రంథాలు
  • మినీ కవితలలో మెనీ భావాలు (ఎం .ఫీల్.),
  • పిల్లలలో కవిత్వ రచనా నైపుణ్యాలు (పిహెచ్.డి.)

భాషా శాస్త్ర గ్రంథాలు

[మార్చు]
  • తెలుగు బోధనా ప్రదీపిక
  • బోధనాంతరంగం
  • Methods of Teacher Training

సంపాదకత్వంలో ప్రచురణలు

[మార్చు]

1980 నుండి మినీ కవిత్వ ప్రచారం కొనసాగిస్తూ 2005 వరకు వఛ్చిన 477 మంది కవుల 1227 మినీ కవితల సంకలనం "వెయ్యి నూట పదహార్లు",[4] మినీ కవిత 2006, మినీ కవిత 2007, మినీ కవిత 2008, మినీ కవిత 2009... ఇంకా మన బందరు, తొలి పంట, అక్షర ప్రతిభ, సునామీ, రాళ్ళబండి కవితాప్రసాద్ అవధాన పద్యాలకు వ్యాఖ్యానంతో రెండు గ్రంథాలు. ఇటీవల ఫేస్ బుక్ అమరావతి సాహితీ మిత్రులు గ్రూపులో నిర్వహించిన మూడు నెలల మినీ కవితల వర్క్ షాపుల విశ్లేషణలు, మినీ కవితలతో ప్రచురించిన "మినీ కవిత వెలుగులు"[5]... మొదలైన సంకలనాలు.

పాటలు

[మార్చు]

రంగాంతరంగాలు పాటల సంపుటి (2025). యూట్యూబ్ "రావి రంగారావు పాటలు" (Ravi Ranga Rao songs) [6]యూట్యూబ్ ఛానెల్లో 300 పాటలకు పైగా వీడియోలతో జనాన్ని ఆకట్టుకునేలా కృషి చేస్తున్నారు.

అవార్డులు-సత్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ABN (2021-02-14). "ప్రజా చైతన్య కాంతులు .. రావి కవితలు". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-24.
  2. "జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2024". వసుంధర అక్షరజాలం. 2024-11-19. Retrieved 2026-01-24.
  3. ABN (2021-02-14). "ప్రజా చైతన్య కాంతులు .. రావి కవితలు". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-24.
  4. విహారి (2021-04-25). "ఏరిన ముత్యాలు 15 | Erina Mutyaalu 15" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2026-01-24.
  5. "రావి రంగారావు కవిత్వం Ravi Rangarao Kavitvam" (in ఇంగ్లీష్). Retrieved 2026-01-24.
  6. రావి రంగారావు పాటలు Ravi Ranga Rao songs (2026-01-16), మొక్కలకు నీళ్లు పోయాలి, retrieved 2026-01-24