రావి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1983 లో జన్మించిన రావి శ్రీనివాస్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు.

తెలుగుదేశం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు.

2014 తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు .

ఆ తర్వాత టిడిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బహుజన సమాజ్వాది పార్టీలో చేరారు రావి శ్రీనివాస్ .

2018 తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ 4 స్థానంలో నిలిచారు .

ఆ తర్వాత బిఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2023 తెలంగాణలో జరిగనున్న శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు రావి శ్రీనివాస్.

పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో తనదైన సేవ, సామాజిక కార్యక్రమాలతో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి మన్ననలు పొందారు రావి శ్రీనివాస్ . ఇది రావి శ్రీనివాస్ గెలుపుకి ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు .

పలుమార్లు గెలిచిన కోనేరు కోనప్ప ఆ నియోజకవర్గంలో బలంగా ఉండటం.. అలాగే బిఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి సిర్పూర్ నుంచి పోటీ చేయడం అనే అంశాలు నెగిటివ్ అంశాలుగా చెప్పవచ్చు .[1]

మూలాలు[మార్చు]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.