రాష్ట్రీయ సేవా సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తా మునిరత్నం

రాష్ట్రీయ సేవా సమితి ఇది చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత జి. మునిరత్నం నాయుడు చే యేర్పాటు చేయబడిన సేవా సంస్థ. దీనిని ఆయన 1981లో రాయలసీమ సేవాసమితి పేరుతో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు పి.రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు ఎన్‌.జి.రంగాతో కలిసి ఏర్పాటు చేశారు.[1] క్రమేణా ఈ సంస్థ రాయలసీమకే కాకుండా ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు లందు విస్తరించింది. దీంతో ఈ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు.

ప్రస్తుతం రాష్ట్రీయ సేవా సమితి శిశువిహార్‌, బాల విహార్‌, ఛైల్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం, అంగన్‌వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్‌ హోం, మత్తు మందు బానిసల పునరావాస కేంద్రం తదితర సేవల ద్వారా 2500 గ్రామాలలో ప్రజలకు సేవలు అందిస్తున్నది.

1981 నుండి ఈ సేవాసమితికి సంస్థాపక గౌరవ కార్యదర్శిగా జి. మునిరత్నం నాయుడు గారు సేవలందిస్తున్నారు. వీరు బడుగు వర్గాలు, స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం వివిధ సంస్థలు స్థాపించాడు. వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాడు. వికలాంగుల జాతీయ కమిషన్‌లో అసోసియేషన్‌ మెంబర్‌, సీఏపీఏఆర్‌టీ సెంట్రల్‌ కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. బాల భారతికి చైర్‌పర్సన్‌గా ఉన్నాడు.వీరి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులను ప్రదానం చేసింది. 1989లో ఇందిరాగాంధీ నేషనల్‌ అవార్డు, 1991లో శిరోమణి, 1992లో జెమ్‌ ఆఫ్‌ ఇండియా, 1993లో బాలబంధు, 1996లో నవాబ్‌ మెహిదీ నవాజ్‌జంగ్‌ బెస్ట్‌ వెల్ఫేర్‌, 1998లో పైడి లక్ష్మయ్య మెమోరియల్‌, 2006లో రాజీవ్‌గాంధీ మానవసేవ, 2010లో హరిజన బంధు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2012 లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.

మూలాలు[మార్చు]

  1. "Dr. GUTTA MUNIRATNAM (Fonder General Secretary, Rashtriya Seva Samithi (RASS), Tirupati, India)" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-04-26.

ఇతర లింకులు[మార్చు]