Jump to content

రాహుల్ యాదవ్ నక్కా

వికీపీడియా నుండి
(రాహుల్‌ యాదవ్‌ నక్కా నుండి దారిమార్పు చెందింది)
రాహుల్‌ యాదవ్‌ నక్కా
జననం3 ఆగష్టు
జాతీయత భారతదేశం
వృత్తినిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసీమాన్వి
పిల్లలుసాహస్ [1]
తల్లిదండ్రులుఉమేష్‌కుమార్‌ యాదవ్‌, సావిత్రి

రాహుల్‌ యాదవ్‌ నక్కా తెలుగు సినిమా నిర్మాత. ఆయన 2017లో మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రాహుల్‌ యాదవ్‌ నక్కా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉమేష్‌కుమార్‌ యాదవ్‌, సావిత్రి దంపతులకు జన్మించాడు.ఆయన బీటెక్‌ వరకు చదువుకున్నాడు.రాహుల్ యాదవ్ కు సీమాన్వి తో 23 మే 2014న హైదరాబాద్ ఇమేజ్ గార్డెన్స్ తో వివాహం జరిగింది.[3]

వృత్తి జీవితం

[మార్చు]

రాహుల్‌ యాదవ్‌ 2005లో బీటెక్‌ పూర్తి చేశాక, మూడు సార్లు సివిల్స్‌ ఎగ్జామ్స్ రాశాడు. అక్కడ ఇంటర్వ్యూ దాకా వెళ్లి విఫలమయ్యాడు. ఆయన తరువాత తన మిత్రుడుతో కలిసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కోల్‌కాతా నుండి కటక్ వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను పూర్తి చేశాడు.[4]

సినీ జీవితం

[మార్చు]

రాహుల్‌ యాదవ్‌ తన స్నేహితుల ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి తో పరిచయం ఏర్పడింది.గౌతం చెప్పిన కథ నచ్చడడంతో మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని అనుకున్నాడు,కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఆయనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు.రాహుల్‌ యాదవ్‌ 2017లో గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. రాహుల్‌ యాదవ్‌ 2019లో మరో నూతన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రానికి మరో రెండు భాగాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపాడు.[5]

నిర్మాతగా
  1. మళ్ళీరావా (2017) [6]
  2. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019) [7]
  3. మసూద (2022)

మూలాలు

[మార్చు]
  1. Telugu Cinemas (2019). "Malli Raava producer Rahul Yadav Nakka celebrates his Son's First Birthday" (in ఇండోనేషియన్). Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  2. Sakshi (1 July 2019). "సివిల్స్ ప్లాప్.. సినిమా హిట్..!". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  3. The Times of India (23 May 2014). "Perfect knot: Rahul Yadav weds Simanvi". photogallery.indiatimes.com. Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  4. issuu. "NAKKATelugu Cinema: Interview with Producer Rahul Yadav". issuu. Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  5. Sakshi (3 August 2020). "మరో రెండు భాగాలు". Archived from the original on 19 April 2021. Retrieved 7 July 2021.
  6. Sakshi (16 March 2017). "మళ్లీ ప్రేమకథలో." Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
  7. The Times of India (15 July 2019). "Rahul Yadav Nakka expresses his gratitude for the success of Agent Sai Srinivasa Athreya - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.

బయటి లింకులు

[మార్చు]