రిక్కీ కేజ్
రిక్కీ కేజ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రిక్కీ కేజ్ |
జననం | 1981 ఆగస్టు 5 |
క్రియాశీల కాలం | 2000–ప్రస్తుతం |
రికీ కేజ్ (ఆంగ్లం: Ricky Kej; జననం 1981 ఆగస్టు 5) మూడు సార్లు గ్రామీ అవార్డు కైవసం చేసుకుని, మరో మూడు సార్లు నామినేట్ అయిన భారతీయ సంగీత స్వరకర్త, పర్యావరణవేత్త.[1] ఆయన న్యూయార్క్, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా 30కి పైగా దేశాల్లోని వేదికలపై ప్రదర్శన ఇచ్చాడు.[2] డిసెంబరు 2022లో, ఆయనను ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ (UNHCR) "గుడ్‌విల్ అంబాసిడర్"గా ప్రకటించాడు.[1]
2022లో, ఆయన బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో రాక్ & రోల్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి తన ఆల్బమ్ "డివైన్ టైడ్స్" రూపొందించాడు. దీనికి గానూ 64వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో గ్రామీని గెలుచుకున్నాడు. ఈ ఆల్బమ్ రోలింగ్ స్టోన్, బ్లూమ్‌బెర్గ్, ది సండే గార్డియన్, ఇండియా టుడే వంటి అనేక వార్తా సంస్థలచే విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఫిబ్రవరి 2023లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో "డివైన్ టైడ్స్" రెండవ గ్రామీ అవార్డును గెలుచుకుంది.[3] 2015లో, ఆయన 57వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో తన ఆల్బమ్ "విండ్స్ ఆఫ్ సంసార" కోసం బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో గ్రామీని గెలుచుకున్నాడు.[4] ది ప్రాజెక్ట్, అతని 14వ స్టూడియో ఆల్బమ్, ఆగస్ట్ 2014లో యుఎస్ బిల్‌బోర్డ్ న్యూ ఏజ్ ఆల్బమ్‌ల చార్ట్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది,[5][6] ఇది భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మొదటిది కావడం విశేషం.[7] ఈ ఆల్బమ్ జూలై 2014 నెలలో జోన్ మ్యూజిక్ రిపోర్టర్ టాప్ 100 రేడియో ఎయిర్‌ప్లే చార్ట్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.[8]
భారతదేశంలో బలమైన పైరసీ వ్యతిరేక చట్టాల కోసం ఆయన న్యాయవాదిగా కృషి చేస్తున్నాడు.[9][10]
ప్రారంభ జీవితం
[మార్చు]రికీ కేజ్ 1981 ఆగస్టు 5న పంజాబీ, మార్వాడీ దంపతులకు జన్మించాడు.[11] ఆయన ఎనిమిదేళ్ల వయసులో వారి కుటుంబం బెంగుళూరుకు మారి అక్కడే నివసిస్తున్నారు.[12] ఆయన బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ డెంటల్ కాలేజ్ నుండి డెంటిస్ట్రీని పూర్తి చేశాడు. కానీ ఆయన ఆ రంగంలో వృత్తిని కొనసాగించకుండా సంగీత వృత్తిని ఎంచుకున్నాడు.[13] యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు అతను ప్రోగ్రెసివ్ రాక్ బ్యాండ్‌లో చేరాడు, అది అతనికి సంగీతానికి మంచి పునాదిని వేసిందని చెప్పాలి.[14] ఆయన తల్లి పమ్మీ కేజ్ అడ్డుచెప్పలేదు. ఆయన తాత నటుడు, ఒలింపిక్ సైక్లిస్ట్, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన అతని జానకి దాస్.[15][16]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Ricky Kej". GRAMMY.com (in ఇంగ్లీష్). 2020-11-23. Archived from the original on 21 September 2021. Retrieved 2021-05-17.
- ↑ "WHO | First WHO Global Conference on Air Pollution and Health, 30 October – 1 November 2018". WHO. Archived from the original on 14 March 2018. Retrieved 2020-11-16.
- ↑ admin (2023-02-06). "Ricky Kej, Indian Music composer based out of Bengaluru, has won his third Grammy Award for the album 'Divine Tides'". Mamaraazzi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-02-08.
- ↑ "57th Annual Grammy Award Nominees". National Academy of Recording Arts and Sciences. December 2014. Archived from the original on 3 May 2012. Retrieved 6 December 2014.
- ↑ "New Age Albums Charts". Billboard. August 2014. Archived from the original on 4 October 2014. Retrieved 27 November 2014.
- ↑ Rodricks, Allan Moses (July 2014). "Rocking The Kej". The Hindu. Archived from the original on 30 November 2014. Retrieved 27 November 2014.
- ↑ D G, Supriya (18 August 2014). "Topping Charts the Kej Way". NRI Pulse. Archived from the original on 20 December 2014. Retrieved 27 November 2014.
- ↑ "Top 100 Radio Airplay Chart". ZoneMusicReporter. July 2014. Archived from the original on 29 November 2014. Retrieved 27 November 2014.
- ↑ "Grammy Winner Ricky Kej Says India is Not the Primary Market For His Music". NDTV. February 2015. Archived from the original on 19 February 2015. Retrieved 19 February 2015.
- ↑ Aravind, Indulekha (February 2015). "India doesn't produce more Grammy winners because of Bollywood". Business Standard. Archived from the original on 20 February 2015. Retrieved 19 February 2015.
- ↑ Ghose, Priyanjali (November 2009). "Bangalore to Mumbai". Mid-Day. Archived from the original on 5 December 2014. Retrieved 28 November 2014.
- ↑ D G, Supriya (18 August 2014). "Topping Charts the Kej Way". NRI Pulse. Archived from the original on 20 December 2014. Retrieved 27 November 2014.
- ↑ Choudhury, Prerna (December 2009). "Tuned to Pefection". The New Indian Express. Retrieved 27 November 2014.[permanent dead link]
- ↑ Ghose, Priyanjali (November 2009). "Bangalore to Mumbai". Mid-Day. Archived from the original on 5 December 2014. Retrieved 28 November 2014.
- ↑ Rodgers, Debbie (August 2004). "Young on the console". The Hindu. Archived from the original on 2014-11-30. Retrieved 27 November 2014.
- ↑ D G, Supriya (18 August 2014). "Topping Charts the Kej Way". NRI Pulse. Archived from the original on 20 December 2014. Retrieved 27 November 2014.