రిక్షావోడు
రిక్షావోడు | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | క్రాంతి కుమార్ |
తారాగణం | చిరంజీవి, నగ్మా |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | డిసెంబరు 14, 1995 |
భాష | తెలుగు |
రిక్షావోడు 1995 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. చిరంజీవి, నగ్మా, సౌందర్య ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.
కథ
[మార్చు]రాజు (చిరంజీవి) తన బామ్మ (మనోరమ) తో కలిసి ఉపాధి కోసం పట్నానికి వస్తాడు. ఓ రిక్షా కార్మికుడి (బ్రహ్మానందం) సాయంతో రిక్షాలు అద్దెకిచ్చే నరసక్క (సౌందర్య) దగ్గర ఒక రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు. జి. కె. రావు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తుంటాడు. అతని కూతురు రాణి (నగ్మా) గర్విష్టి. ఒక రోజు నిర్లక్ష్యంగా కారు తోలి రాజు రిక్షాను గుద్దేస్తుంది. రాజు ఆమెపై కోర్టులో కేసు వేస్తాడు. కానీ జి. కె. రావు బలం వల్ల ఆ కేసు ఓడిపోతాడు. రాజు మాత్రం అప్పుడప్పుడూ రాణి తో చిన్న కొట్లాటలు పెట్టుకుంటూ ఉంటాడు. రాజుకు జనంలో ఉన్న ఆదరణ చూసిన జి. కె. రావు తన కూతురు రాణిని అతన్ని పెళ్ళి చేసుకునేలా ఒప్పిస్తాడు. అలా చేస్తే రాజకీయంగా తన పలుకుబడి పెరుగుతుందని అతని నమ్మకం. రాజు బామ్మ జి. కె. రావును చూడగానే అతని తండ్రి ధర్మారాయుడు గురించిన గతం చెబుతుంది.
తారాగణం
[మార్చు]- ధర్మారాయుడు/రాజు గా చిరంజీవి
- రాణి గా నగ్మా[1]
- నరసక్క గా సౌందర్య
- జి. కె. రావు గా పరేష్ రావల్
- రిక్షా కార్మికుడు గా బ్రహ్మానందం
- రాజు బామ గా మనోరమ
- జయసుధ
- న్యాయమూర్తి గా సుబ్బరాయ శర్మ
- జి. కె. రావు అసిస్టెంటు గా ఎ. వి. ఎస్
- గుండు హనుమంతరావు
పాటలు
[మార్చు]- అర్ధరాతిరో యమ్మా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత
- రూప్ తేరా మస్తానా గానం: బాబా సెహగల్, సుజాత
- దేవుడైన జీవుడైన రిక్షావోడు రా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఏం దెబ్బ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- నీ పెట్ట నా పుంజును , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- పాప ఏది రింపా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (19 February 2019). "మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?". www.andhrajyothy.com. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.