రియాక్షన్సు
రియాక్షన్సు కొన్ని అలోపతి మందులు పడకపోవడం వలన రోగి శరీరంలో వచ్చే చెడ్డ పరిమాణాలు. యాంటి బయటిక్సు కలిసిన మందులను ఇంజక్షను ద్వారా రోగులకు ఇచ్చినప్పుడు అరుదుగా చాలా తక్కువ మందికి మాత్రమే రియాక్షను అవుతుంది.
రియాక్షన్సుకు కారకాలైన మందులు
[మార్చు]ఈ క్రింద పెర్కొన్న మందులు లేక కాంపౌండ్స్ ఇంజక్షను రూపకంగా ఇచ్చినప్పుడు రియాక్షన్సుకు కారకాలు అవ్వవచ్చు.[1]
- పెన్సిలిన్
- ప్రొకైన్ పెన్సిలిన్
- యాంపిసిలిన్
- సల్ఫా
- నిరోబియాన్
- అనాల్జిన్
- యాస్పిరిన్
రియాక్షన్సు రకాలు
[మార్చు]రియాక్షన్సు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఎనఫిలాక్టిక్ షాక్ అంటారు. రెండవది శరీరంలో స్వల్ప మార్పులను తెస్తుంది. దీనిని ఎలర్జీ అంటారు. ఎనఫిలాక్టిక్ షాక్ ఇంజక్షను చేసాక సెకెండ్లలో కాని నిముషాలలో కాని రావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి తీవ్ర రియాక్షను ఇచ్చే మందులు ఎంతో తప్పనిసరైతే కానివాడరాదు.
ఎనఫిలాక్టిక్ షాక్ లక్షణాలు
[మార్చు]ఈ తీవ్ర రియాక్షను కలిగిన రోగి ఈ క్రింది లక్షణాలను అన్నీ కాని కొన్ని కాని కనబరుస్తాడు.
- భయ భ్రాంతులు
- శరీరం ఉబ్బి దద్దుర్లు రావటం
- ఊపిరాడక పోవటం
- శరీరంలో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందనిపించటం
- గురకతో, గొంతులో ఏదో అంతరాయం ఉన్నట్లు అనిపించడం
- శరీరం నీలంగా మారటం
- దిగ్భ్రాంతి
- జ్వరం
- కనుపాపలు విశాలమవటం
- స్పృహ కోల్ఫోవటం
- ఫిట్సు
ఈ రియాక్షను వచ్చిన 5 నుండి 10 నిముషాలలో రోగి మరణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణ వైద్యం జరగాలి.
మూలాలు
[మార్చు]- ↑ డా. పి.వి.కె. విశ్వనాధ రాజు. అల్లోపతి సర్వస్వం, దేశసేవ ప్రచురణలు, హదరాబాద్. 1990: పేజి. 483